ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్దం జరిగింది. మహాభారతంలో శ్రీకృష్ణుడిది కీలకమైన పాత్ర. తన తెలివైన వ్యూహాలతో కురుక్షేత్రంలో పాండవులు విజయానికి కారణమయ్యాడు. శ్రీకృష్ణుడు.. అర్జునుడికి కర్తవ్య నిర్వహణ గురించి .. అర్జునుడికి మార్గశిర మాసం శుక్ష పక్షం ఏకాదశి రోజున ( 2025 డిసెంబర్ 1) హితబోధ చేశాడని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తుంది. మోక్షం కలగాలంటే ఏమి చేయాలో శ్రీకృష్ణుడు వివరించాడు.
మోక్షద ఏకాదశి ( మార్గశిరమాసం .. శుక్లపక్షం.. ఏకాదశి) గురించి కృష్ణుడు పాండవులకు వివరించిన కథ బ్రహ్మాండ పురాణంలో ఉంది... వైఖానసుడు అనే రాజు తన తండ్రి ..నరకం’లో బాధలను పొందుతున్నట్లు కలగంటాడు. రుషి మునుల సలహాలపై వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంపూర్ణ ఉపవాసం చేశాడు. ఈ వ్రతఫలంగా వైఖానసుని తండ్రికి నరకబాధ తొలగిపోయి మోక్షప్రాప్తి కలిగిందని పండితులు చెబుతున్నారు.
మార్గశిర మాసం శుక్షపక్షం ఏకాదశి రోజున ( 2025 డిసెంబర్ 1) ఉపవాసం, విష్ణు ఆరాధన – విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి.ప్రదోషకాలంలో ( సాయంత్రం) షోడశోపచారాలతో నారాయణుని అర్చించాలి, ద్వాదశినాడు తిరిగి పూజించి అన్నాదికాలు నివేదించి పారణచేయాలి.
ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహమపరేహని!భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత!! అని మంత్రముఉచ్చరించి పుష్పాంజలిని దేవునికి సమర్పించాలి.
మార్గశిర శుద్ద ఏకాదశిని మోక్షద’ ఏకాదశి అని పిలుస్తారు.ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఇదే రోజున కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను బోధించాడన్నది పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ రోజున గీతాజయంతి కూడా జరుపుకుంటారు.
ఏంచేయాలంటే..
భగవద్గీత పారాయణం: గీతాజయంతి రోజున భగవద్గీతను పారాయణం చేయాలి. ఇది పుణ్యకార్యమని పండితులు చెబుతారు. గీత చదవడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం లభిస్తుంది.
మంత్ర పఠనం: ఓం నమో భగవతే అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం జపించడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
తులసి పూజ: తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున తులసి మొక్కను పూజించి, తులసి దళాలను దేవునికి సమర్పించండి.
శ్రీకృష్ణుడిని ఆరాధించాలి: కృష్ణుడి విగ్రహం .. లేదా చిత్ర పటం ముందు దీపం వెలిగించి.. ధూపం .. దీపం.. పువ్వులు సమర్పించాలి. స్వామి వారికి వెన్నతో తయారు చేసిన పదార్ధాలను నైవేద్యం సమర్పించాలి.శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది
దానం: పేదలకు ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి.
మాసానాం మార్గశిర్షోహం అంటారు. అంటే.. అన్ని నెలలకు కూడా ఈ మాసం శిరస్సు తల వంటిదని అర్థం. ఈ నెలలోనే కురకేత్ర యుద్దం స్టార్ట్ అయ్యిందని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. మార్గశిర మాసంలో శుక్ల పక్ష ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి.. అర్జునుడికి గీతా ఉపదేశం చేశాడు. ప్రతి మానవుడు కర్మయోగం ప్రకారం నిస్వార్థంగా జీవితం గడపాలి. మోక్షం అంటే భగవంతుని ఆరాధిస్తూ ఆయనలోనే ఐక్యం అయ్యే ప్రక్రియ. భగవద్గీత జీవిత సత్యాన్ని .. ఎలా నడచుకోవాలి.. అనే విధానాల గురించి వివరిస్తుంది. మనిషి .. భగవంతునికి ఎలా దగ్గరవ్వాలో మార్గాన్ని సూచిస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
