ఏపీలో వణుకు పుట్టిస్తున్న కొత్త వ్యాధి.. 1317 కు చేరిన స్క్రబ్ టైఫస్ కేసులు

ఏపీలో వణుకు పుట్టిస్తున్న కొత్త వ్యాధి.. 1317 కు చేరిన స్క్రబ్ టైఫస్ కేసులు

ఏపీలో కొత్త పురుగు వ్యాధి వణుకు పుట్టిస్తోంది. స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలై క్రమక్రమంగా రాష్ట్రమంతా వ్యాపిస్తోంది. సోమవారం ( డిసెంబర్ 1 ) నాటికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1317 కు చేరినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ వ్యాధి బారిన పడి విజయనగరానికి చెందిన మహిళ ఇవాళ మృతి చెందడంతో భయాందోళనకు గురవుతున్నారు జనం. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మహిళ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా ఆమెకు స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకినట్లు నిర్దారించారు వైద్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది మహిళ.

స్క్రబ్ టైఫస్ క్రమక్రమంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వ్యాపితుండటంతో భయాందోళనకు గురవుతున్నారు జనం. చిత్తూరులో 379, , కడపలో 94, నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కాకినాడలో 141, విశాఖపట్నంలో 123 కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాలలో 30 కేసులు నమోదైనట్లు తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ.

Also read:-- పొగాకు నమలే మహిళల్లో నోటి క్యాన్సర్.. 

స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్దారణ అయితే... యాంటీబయాటిక్స్ వాడకంతో వ్యాధి నయం అవుతుందని, వ్యాధి లక్షణాలు కనపడగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఈ వ్యాధి లార్వల్ మైట్స్ అనే పురుగు కుట్టడం ద్వారా వస్తుందని చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి పురుగులు ఎక్కువగా వ్యవసాయ భూములు కొండా ప్రాంతాల్లో ఉంటాయని.. అపరిశుభ్రమైన పరిసరాలు, చెత్త, పనికిరాని మొక్కలు, మురుగు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో స్క్రబ్ టైఫస్ పురుగు ఉంటుందని చెబుతున్నారు. 

శీతాకాలంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మూడేళ్ళ కిందట కూడా శ్రీకాకుళం జిల్లాలో ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వ్యాధి పట్ల అప్రమత్తమైన అధికారులు పారిశుధ్య చర్యలు చేపట్టి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో స్క్రబ్ టైఫస్ నియంత్రణలోకి వచ్చినట్లు తెలిపారు.