భారతదేశంలోని మహిళల్లో నోటి క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు మార్పులను భారతీయ శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది. ముఖ్యంగా దేశంలో ఉన్న దక్షిణ ప్రాంతాల మహిళా పై ఈ అధ్యయనం జరిగింది.
బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCASR) & కళ్యాణిలోని BRIC-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్ (NIBMG) బృందం, కోలార్‌లోని శ్రీ దేవరాజ్ ఉర్స్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (SDUAHER) వైద్యులతో కలిసి భారతదేశంలో పొగాకు నమలడం అలవాటుతో నోటి క్యాన్సర్‌పై అధ్యయనాన్ని నిర్వహించింది.
ప్రొఫెసర్ తపస్ కె కుండు (JNCASR) ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం మహిళల్లో నోటి క్యాన్సర్ ఎందుకు ప్రత్యేకంగా ఉంటుంది, వ్యాధి ఎలా పెరుగుతుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, వారికి మంచి వైద్యం ఎలా అందించవచ్చో అర్థం చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం.
Also read:-- ఏపీలో వణుకు పుట్టిస్తున్న కొత్త వ్యాధి.. 1317 కు చేరిన స్క్రబ్ టైఫస్ కేసులు
ప్రపంచంలోనే అత్యధికంగా నోటి క్యాన్సర్ భారాన్ని మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి. దక్షిణ, ఈశాన్య భారతదేశంలో పొగాకుతో కలిపిన తమలపాకులు, గుట్కా వంటివి నమలడం వల్ల మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో ఎక్కువగా అధ్యయనం చేసినప్పటికీ, మహిళల్లో దీని గురించి పరిశోధనలు తక్కువగా ఉన్నాయి.
అయితే శాస్త్రవేత్తల బృందం కణితి కణజాలాలను విశ్లేషించడానికి డీప్ లెర్నింగ్ (artificial intelligence)ను ఉపయోగించింది. ఈ విశ్లేషణలో మహిళా రోగులలో రెండు వేర్వేరు గ్రూపులు ఉన్నట్లు కనుగొంది. అలాగే ప్రతి గ్రూపులోని కణితులు వేర్వేరు రకాల రోగనిరోధక ప్రతిస్పందనను చూపించాయి.
కర్ణాటకలోని కోలార్ జిల్లా మహిళల్లో సాధారణంగా ఉండే లోకల్ పొగాకు నమలే అలవాటు ఉన్న రోగుల సాంపుల్స్ విశ్లేషించగా, నోటి కణితి పుట్టుకకు కారణమయ్యే ఒక ప్రత్యేకమైన డ్రైవర్ జన్యు మార్పు (మ్యుటేషన్) వెల్లడైంది.
ఈ పరిశోధన భారతీయ మహిళల్లో వచ్చే ప్రాణాంతకమైన నోటి క్యాన్సర్ మూలాలను అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైనదని పరిశోధకులు తెలిపారు. ఈ ఫలితాలు 'క్లినికల్ అండ్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్' అనే జర్నల్‌లో ప్రచురించాయి.
