రవ్వల రెసిపీలు : బొంబాయి రవ్వతో ఉప్మానే కాదు.. ఇలాంటి కట్ లెట్, పొంగలి కూడా చేసుకుని తినొచ్చు..!

రవ్వల రెసిపీలు : బొంబాయి రవ్వతో ఉప్మానే కాదు.. ఇలాంటి కట్ లెట్, పొంగలి కూడా చేసుకుని తినొచ్చు..!

ఉప్మారవ్వతో... అదేనండి బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుని తినడమే కాదు.. రకరకాల వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. రవ్వతో సాధారణంగా  స్వీట్లు తయారు చేస్తారు. కానీకట్​లెట్ ...  పొంగలి .. ​ కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఫాస్ట్‌గా ఈ టేస్టీ ఫుడ్​  కంప్లీట్ అవుతుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ రవ్వ కట్​ లెట్ ... పొంగలి ​  ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. . .!

కట్​ లెట్​ తయారీకి కావలసినవి

ఉప్మా (బొంబాయి రవ్వ) 1 : కప్పు
నూనె : 2 స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు : 2టేబుల్ స్పూన్లు..
ఉల్లిగడ్డ తరుగు: 3 టేబుల్ స్పూన్లు
అల్లం తరుగు: 1 టీస్పూన్
క్యారెట్ తురుము : 3 టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న: 2 టేబుల్ స్పూన్లు
పసుపు :1/4 టీ స్పూన్
గరంమసాల :  1/2 టీస్పూన్
పచ్చిబఠాని: 2 టేబుల్ స్పూన్లు
ఆమ్​చూర్ :1/2 టీస్పూన్
ఉప్పు : తగినంత
నీళ్లు: 1 కప్పు
కొత్తిమీర తరుగు : 2 టేబుల్ స్పూన్

కట్​లెట్ కోసం

మొక్కజొన్న పిండి: 1/4 టీస్పూన్​
మిరియాలపొడి: 1/4 టీస్పూన్
బ్రెడ్​పొడి: 1 కప్పు
జీడిపప్పు: 7
నూనె : తగినంత

తయారీ విధానం :  బాండీలో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. తరువాత అందులో అల్లం క్యారెట్ స్వీట్ కార్న్, పచ్చిబఠానీ , గరంమసాల, ఉప్పు పసుపు ఆమ్​చూర్ వేసి బాగా వేగించాలి. తరువాత నీళ్లు పోసి మరిగించాలి. తరువాత అందులో రవ్వ వేసి మెత్తగా ఉప్మాలాగా ఉడికించాలి.  కొత్తిమీర చల్లి చల్లార్చాలి. తరువాత రవ్వ మిశ్రమాన్ని కట్ లెట్ ఆకారంలో గుండ్రంగా వత్తాలి. దానిపై జీడిపప్పు పెట్టి కొంచెం వత్తాలి. తరువాత మొక్కజొన్న పిండిని తీసుకొని కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా చేయాలి. ఒక ప్లేట్ లో బ్రెడ్ పొడిని ఉంచాలి. కట్​ లెట్​ ను  తీసుకొని ముందుగా మొక్కజొన్న పిండి మిశ్రమంలో ముంచి తరువాత బ్రెడ్​ పొడిలో రెండువైపులా అద్దాలి అన్ని కట్ లెట్లు తయారు చేసుకున్నాక పొయ్యి మీద బాండీ పెట్టి కట్​ లెట్​లను వేగించేందుకు సరిపడా నూనె పోయాలి. నూనె వేడయ్యాక కట్ లెట్లు వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేలా వేగించాలి.

రవ్వతో పొంగలి తయారీకి కావలసినవి

పెసరపప్పు : 1/2 కప్పు
నీళ్లు: 2 కప్పులు
నూనె లేదా నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర : 2 టీస్పూన్లు
మిరియాలు :1 టేబుల్ స్పూన్.
 అల్లం తరుగు : 1 టేబుల్ స్పూన్
ఇంగువ: చిటికెడు
జీడిపప్పు :15
కరివేపాకు : 2 రెమ్మలు
ఉప్పు: తగినంత

తయారీ విధానం: పెసరపప్పును వేగించి శుభ్రం చేసి కుక్కర్ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు రవ్వను వేగించాలి. అదే పాన్​ లో  కొంచెం నూనె లేదా నెయ్యి వేసి జీలకర్ర జీడిపప్పులను బంగారు రంగు వచ్చేంత వరకు వేగించాలి. తరువాత కరివేపాకు, అల్లం తరుగు, మిరియాల పొడి వేయాలి. రెండున్నర కప్పుల నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి మరిగించాలి. మరుగుతుండగా అందులో కలుపుతూ రవ్వను వేయాలి. ఉండలు కట్టకుండా కలపాలి. తరువాత ఉడికించిన పెసరపప్పును కూడా వేసి సన్నని మంటమీద 5నుంచి 10నిమిషాలు ఉంచాలి. అంతే ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటాయి.