ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం : కలెక్టర్ సంతోష్

ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకం :  కలెక్టర్  సంతోష్

గద్వాల, వెలుగు: ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని కలెక్టర్  సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్  అలీ పేర్కొన్నారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా నాల్గవ మహాసభ పట్టణంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా వార్తలతో ప్రజల ఆధారాభిమానాలు చూరగొనాలని సూచించారు. 

జర్నలిస్టులు ప్రజలకు ఉపయోగపడే వార్తలు రాయడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటిపై స్పందించి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వర్కింగ్  జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని, ఆమోదయోగ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిజం పవిత్రమైన వృత్తిగా పేర్కొన్నారు. విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి మేలు చేస్తుందన్నారు. ఫలితంగా ప్రజల్లో విలేకరులకు గౌరవం పెగుతుందని చెప్పారు. 

అనంతరం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ, ఎలక్ట్రానిక్​ మీడియా అధ్యక్షుడిగా పురేందర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, మధు గౌడ్, బాలస్వామి, ధరూర్ శ్యామ్, కన్నయ్య, ప్రశాంత్  పాల్గొన్నారు.