
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మునిసిపల్ పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో చోరీ జరిగింది. కాలనీకి చెందిన శాంతయ్య ఈ నెల 14న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలోని 8 తులాల బంగారం, 15 తులాల వెండి, రూ.20 వేల నగదు చోరీకి గురయ్యాయి.