లోక్‌‌ అదాలత్‌‌లో 5.59 లక్షల .. కేసులు పరిష్కారం

లోక్‌‌ అదాలత్‌‌లో 5.59 లక్షల ..  కేసులు పరిష్కారం

హైదరాబాద్, వెలుగు:  నేషనల్‌‌ లోక్‌‌అదాలత్‌‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్‌‌అదాలత్‌‌ల్లో 5.59 లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో  ప్రీలిటిగేషన్‌‌ కేసులు 13వేలకుపైగా ఉన్నాయి. కేసుల రాజీతో  కక్షిదారులకు రూ.180.10 కోట్ల పరిహార చెల్లింపులు జరుగుతాయని స్టేట్‌‌ లీగల్‌‌ సర్వీసెస్‌‌ అథార్టీ మెంబర్‌‌ సెక్రటరీ గోవర్ధన్‌‌రెడ్డి చెప్పారు. 

 స్టేట్‌‌ లీగల్‌‌ సర్వీసెస్‌‌ ప్యాట్రన్‌‌ ఇన్‌‌ చీఫ్, హైకోర్టు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, ఎగ్జిక్యూటివ్‌‌ చైర్మన్, జస్టిస్‌‌ పి.శ్యామ్‌‌ కోశీ, హైకోర్టు లీగల్‌‌ సర్వీసెస్‌‌ కమిటీ చైర్మన్,  జస్టిస్‌‌ టి.వినోద్‌‌ కుమార్‌‌ల సూచనలకు అనుగుణంగా వీటిని నిర్వహించారు.  జస్టిస్‌‌ టి.వినోద్‌‌ కుమార్‌‌ సూచనలతో హైకోర్టులో జరిగిన లోక్‌‌అదాలత్‌‌లో 404 కేసులు రాజీ కుదిరాయి. మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌‌ జీవీ సీతాపతి, జస్టిస్‌‌ చల్లా కోదండరాం కేసులను పరిష్కరించారు. 

వాటిలో మోటార్‌‌ వెహికల్‌‌ కేసులు 294, కార్మికుల వివాదాల కేసులు 71ఉన్నాయని, 1100 మంది లబ్ధిదారులకు రూ.15 కోట్ల పరిహారం చెల్లింపులు జరిగాయని హైకోర్టు లీగల్‌‌ సర్వీసెస్‌‌ కమిటీ కార్యదర్శి ఎం.శాంతివర్ధిని చెప్పారు.