- జస్టిస్ పి.శ్యాం కోశీ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: చిన్నపాటి కేసులను లోక్‌అదాలత్‌లలో పరిష్కరిస్తే కోర్టులపై పనిభారం గణనీయంగా తగ్గుతుందని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి జస్టిస్ పి.శ్యాం కోశీ అన్నారు. జరిమానాతో పరిష్కారమయ్యే క్రిమినల్ కేసులు, ఎక్సైజ్, చెక్ బౌన్స్, ఆర్టీఓ సంబంధిత కేసులను ఉభయపక్షాలు చర్చల ద్వారా రాజీ చేసుకోవడానికి లోక్‌అదాలత్ సరైన వేదిక అని వివరించారు.
జాతీయ లోక్‌అదాలత్‌లో భాగంగా ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయడానికి శనివారం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో జస్టిస్ శ్యాం కోశీ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్యాం కోశీ మాట్లాడుతూ..ఎక్సైజ్ కేసులను గుర్తించి లోక్‌అదాలత్‌కు పంపాలని ఎక్సైజ్ కమిషనర్‌ను కోరారు. సమావేశంలో డీజీపీ డాక్టర్ శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి తదితరులు పాల్గొన్నారు.
