
తెలంగాణ నుండి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేశారు ఆ పార్టీ సెక్రెటరీ జేపీ నడ్డా. శుక్రవారం తొలి జాబితాను విడుదల చేయగా.. అందులో 10 మంది పేర్లు ఉన్నాయి. ఈ రోజు మరో ఆరుగురి పేర్లను ప్రకటించారు.
అదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి సోయం బాబూ రావు,
పెద్దపల్లి – ఎస్ కుమార్,
జహీరాబాద్ – బాణాల లక్ష్మారెడ్డి,
హైదరాబాద్ – భగ్వానాథ్ రావు,
చేవెళ్ల – బీ. జనార్ధన్ రెడ్డీ,
ఖమ్మం – వసుదేవ రావు పేర్లను ఫైనల్ చేశారు.
తొలి జాబితాలో ప్రకటించిన వారి పేర్లు: మల్కాజ్‌గిరి – రామచంద్రరావు, సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి, మహబూబ్‌నగర్ – డీకే అరుణ, నాగర్‌కర్నూలు – బంగారు శ్రుతి, కరీంనగర్ – బండి సంజయ్, నిజామాబాద్ – డి. అరవింద్, నల్గొండ – గార్లపాటి జితేంద్రకుమార్, భువనగిరి – పీవీ శ్యామ్‌సుందర్ రావు, వరంగల్ – చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ – హుస్సేన్‌నాయక్ పేర్లను నిన్న ప్రకటించారు.
వీరితో పాటు.. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ముగ్గురి పేర్లను, కెరళ నుంచి ఒకరిని, వెస్ట్ బెంగాల్ నుంచి ఒకరిని ఈ లీస్ట్ లో ప్రకటించారు.
కెరళ, పథానామతిట్టా లోక్ సభ స్థానం సురేంధ్రన్
ఉత్తర్ ప్రదేశ్, కైరానా లోక్ సభ స్థానం నుంచి ప్రదీప్ చౌదరీ, నగినా – యశ్వంత్, బులంద్ షహర్ – భోలా సింగ్,
వెస్ట్ బెంగాళ్.. జంగీ పూర్ లోక్ సభ స్థానం నుంచి మఫుజా కాటన్.. బరిలో ఉన్నారు.
BJP releases list of 11 candidates (6 Telangana, 3 Uttar Pradesh and 1 each for Kerala and West Bengal) for the upcoming Lok Sabha elections. pic.twitter.com/6p9w79ZT8A
— ANI (@ANI) March 23, 2019