న్యూఢిల్లీ: రాజ్యాంగం కేవలం ఒక బుక్ కాదని.. అదొక వాగ్దానమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ‘‘కులం, మతం, ధనిక, పేద, ప్రాంతం, భాష అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం, గౌరవం, సమానత్వం దక్కుతుందని రాజ్యాంగం హామీ ఇచ్చింది.
బడుగు బలహీన వర్గాలు, పేదలకు రాజ్యాంగం ఒక రక్షణ కవచం. అది అణగారిన వర్గాల గొంతుక. రాజ్యాంగం బాగున్నంత కాలం ప్రజలు బాగుంటారు. రాజ్యాంగంపై దాడిని అనుమతించబోమని అందరం ప్రతిజ్ఞ చేద్దాం” అని పిలుపునిచ్చారు.
