మంత్రిగారు.. సభ్యులడిగే ప్రశ్నలపై శ్రద్ధపెట్టాలి : స్పీకర్‌‌‌‌‌‌‌‌ మందలింపు

మంత్రిగారు.. సభ్యులడిగే ప్రశ్నలపై శ్రద్ధపెట్టాలి : స్పీకర్‌‌‌‌‌‌‌‌ మందలింపు

దన్వేకు లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌ ఓం బిర్లా మందలింపు
సభలో అటెన్షగా ఉండండి సభ్యులడిగే ప్రశ్నల్ని ఓపిగ్గా వినండి

న్యూఢిల్లీ: కన్జూమర్స్​ ఎఫైర్స్​ సహాయమంత్రి రావు​సాహెబ్​ పాటిల్​ దన్వే పై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా  సీరియస్​ అయ్యారు. హౌస్​ ప్రొసీడింగ్స్ పై శ్రద్ధపెట్టాలని ఆయనను మందలించారు. మంగళవారం క్వశ్చన్‌​అవర్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. శివసేన  ఎంపీ హేమంత్​ తుకారాం గాడ్సే సప్లిమెంటరీ ప్రశ్న వేసినప్పుడు..దానిని వినిపించుకోని మంత్రి మరొకసారి ఆ ప్రశ్నను రిపీట్​చేయాల్సిందిగా సభ్యుడ్ని  కోరారు. వెంటనే జోక్యం చేసుకున్న స్పీకర్​… “మంత్రిగారు.. సభ్యులడిగే ప్రశ్నలపై శ్రద్ధపెట్టాలి. వాటిని  జాగ్రత్తగా వినాలి” అని మందలించారు. “మీకు మరో చాన్స్​ ఇస్తాను. మళ్లీ అదే క్వశ్చన్​ మీరు అడగొద్దు”అని అన్నారు. అదే టైమ్​లో శివసేన లీడర్​ అర్వింద్​ సావంత్​ గాడ్సే సీటు దగ్గరకు వచ్చి స్పీకర్​ ఏమన్నారో వివరించే ప్రయత్నం చేశారు. ‘‘సావంత్ జీ , గాడ్సేకు నేను ఏమన్నానో వివరించండి”అని స్పీకర్​ కోరారు.

గాడ్సే  వేసిన మరొక ప్రశ్నకు … మంత్రి దన్వేతోపాటు ఆఖరు వరుసలో కూర్చున్న కన్జూమర్​ ఎఫైర్స్​ మినిస్టర్​ రామ్​విలాస్​ పాశ్వాన్​ లేచి , సమాధానం చెప్పారు.  తర్వాత సప్లమెంటరీ ప్రశ్నలకు కూడా పాశ్వానే సమాధానం చెప్పారు. స్పీకర్​ వెంటనే ఎలర్ట్​ అయి కూర్చొనే సమాధానం  చెప్పండి అని  పాశ్వాన్​తో అన్నారు. “మీరు  కూర్చొని సమాధానం చెప్పడానికి సభ కూడా అనుమతి ఇస్తుంది.  మీ కాళ్లకు ఫ్రాక్చర్​ అయింది కదా” అని  బిర్లా గుర్తుచేశారు. అయినప్పటికీ  పాశ్వాన్​ నిలబడే సమాధానం చెప్పారు. “మీకు మళ్లీ చెబుతున్నా.  కావాలనుకుంటే కూర్చొనే సమాధానం  చెప్పొచ్చు. నిలబడితే మీ కాళ్ల నొప్పులు  పెరుగుతాయి కదా ”అని స్పీకర్​ మరోసారి  మంత్రికి నచ్చచెప్పారు.క్వశ్చన్​ అవర్​ లో సప్లిమెంటరీ ప్రశ్నల్ని అడగడానికి పేర్లు ఇచ్చి సభకు రాని ఎంపీలపై స్పీకర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. సప్లిమెంటరీ  పశ్నలు అడుగుతామని పేర్లు ఇచ్చి, సభకు రానివాళ్లకు వింటర్​ సెషన్​లో ఎలాంటి క్వశ్చన్లు అడగడానికి అనుమతించబోమని స్పీకర్​ రూలింగ్​ ఇచ్చారు.

బీజేపీ ఎంపీలకు రాజ్ నాథ్​  వార్నింగ్​

త్వరలో ప్రవేశపెట్టనున్న సిటిజన్​షిప్​ (సవరణ) బిల్లు సమయంలో సభ్యులందరూ పార్లమెంట్​కు హాజరుకావాలని పార్టీ ఎంపీలను డిఫెన్స్​ మినిస్టర్​ రాజ్​నాథ్​ సింగ్​  కోరారు. ఆ టైమ్​లో ఎవరూ  పార్లమెంట్​కు బంక్​ కొట్టొద్దని వార్నింగ్​ ఇచ్చారు.ఆర్టికల్​ 370 రద్దు బిల్లులాగే  సిటిజన్​షిప్​ (సవరణ) బిల్లుకు కూడా  అంతే ప్రాధాన్యం ఉన్నదని గుర్తుంచుకోవాలన్నారు.  మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్​లో రాజ్​నాథ్​ పాల్గొన్నారు.  ఎంపీలు పార్లమెంట్​కు తరచూ రానందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సీరియస్​గా ఉన్న విషయాన్ని  ఎంపీల దృష్టికి కేంద్రమంత్రి  తీసుకొచ్చారు.  జార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ప్రధాని ఈ మీటింగ్​కు రాలేదు.

బుధవారం కేబినెట్​లో  సిటిజన్​ షిప్​ బిల్లుకు క్లియరెన్స్​ వచ్చే అవకాశముందని, ఆతర్వాత దాన్ని పార్లమెంట్‌లో ​ప్రవేశపెట్టనున్నందున ఎంపీలంతా సభలకు హాజరుకావాలని రాజ్​నాథ్​ కోరారు. పార్లమెంట్​లో హుందాగా వ్యవహరించాలని, ప్రతిపక్షాలను కించపరిచేలా కామెంట్స్​ చేయొద్దని సూచించారు.  సభలో దూకుడు ప్రదర్శించినా  కాంగ్రెస్​ మాదిరిగా అగ్రెస్​వ్​గా ఉండొద్దని రాజ్​నాథ్​ కోరారు.  నాథురామ్​ గాడ్సేపై  ఎంపీ  ప్రజ్ఞా ఠాకూర్​ చేసిన కామెంట్స్, ఆ తర్వాత ఆమె లోక్​సభకు సారీ చెప్పిన నేపథ్యంలో రాజ్​నాథ్​ సింగ్​  ఎంపీలకు ఈమేరకు దిశానిర్దేశం చేశారు. ​  ముఖ్యమైన బిల్లులు సభలో ప్రవేశపెడుతున్నప్పుడు ఎంపీలు సభలకు హాజరుకావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ పటేల్​ కోరారు.