పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్...2029 ఎన్నికల్లో టీడీపీలో 33 శాతం సీట్లు: లోకేష్

పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్...2029 ఎన్నికల్లో టీడీపీలో 33 శాతం సీట్లు: లోకేష్

మహానాడు 2026 వేదికగా సంచలన ప్రకటన చేశార టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్.  పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా పార్టీలో మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తామని అన్నారు. 2029 ఎన్నికల్లో టీడీపీలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు లోకేష్. మహానాడు వేదికగా చారిత్రాత్మక తీర్మానం ప్రవేశపెట్టారు లోకేష్. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని.. స్త్రీ శక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని అన్నారు.

పార్లమెంట్ లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేని..వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలని.. మహానాడు వేదిక నుండి తాను ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు లోకేష్. ఇది కేవలం ఒక నినాదంగా కాదని... భారతదేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలని అన్నారు. టీడీపీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారని... ఇది మా సంకల్పం...ఇది మా బాధ్యత...ఇది మా కమిట్ మెంట్ అని అన్నారు లోకేష్.

భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదేనని గట్టిగా నమ్ముతానని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ద్వారా ఎన్డీయే ఒక ఒక చారిత్రాత్మకమైన అడుగు వేసిందని అన్నారు లోకేష్. దురదృష్టవశాత్తు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తిరస్కరించి, మహిళా సాధికారతకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాయని అన్నారు. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయని.. కానీ ఎన్నికల తర్వాత మహిళలను మర్చిపోతాయని అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా, ఆచరణలో మహిళా సాధికారతను విశ్వసిస్తోందని అన్నారు లోకేష్. 

ఇతరులు మద్దతిచ్చినా, మద్దతు ఇవ్వకపోయినా… పార్లమెంట్ అమలు చేసినా చేయకపోయినా… మనం ముందుండి నడిపించాలని నేను ప్రతిపాదిస్తున్నానని అన్నారు లోకేష్. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ అని... కొంతమంది మహిళలను అవమానపరిచేలా మాటలు మాట్లాడతారని... గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు అంటూ మహిళలను తక్కువచేసి మాట్లాడతారని అన్నారు. అలాంటి మాటలు ఎవరూ మాట్లాడకూడదు అని మనం ముందుండి పోరాడాలని అన్నారు. స్కూల్ బుక్స్ లో ఇంటి పనులు చేసే బొమ్మలు అన్నీ మహిళలవే ఉంటే 50 – 50 ఉండాలని ఆదేశించానని అన్నారు లోకేష్.