లోకేష్తో ప్రభాస్ మూవీ సెట్.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్

లోకేష్తో ప్రభాస్ మూవీ సెట్.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్

తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఆయన తన తరువాతి సినిమాను కోసం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో జాయిన్ కాబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్.. ప్రభాస్ తో చేయబోయే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈ న్యూస్ విన్న ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ప్రస్తుతం లోకేష్, తలపతి విజయ్(Thalapthy vijay) తో లియో(Leo movie) సినిమా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కమ్లీట్ చేసుకున్న ఈమూవీ.. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్,లోకేష్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విజయ్ బర్త్ డే సందర్బంగా లియో నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా తరవాత లోకేష్ కనగరాజ్, రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. తాను ప్రభాస్‌తో చేయబోయే సినిమా మా ఇద్దరి కెరీర్లలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని, ‘లియో’ సినిమా పూర్తిచేసిన తరవాత ప్రభాస్‌ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతానని అన్నారు. దీంతో లోకేష్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.