ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిసిన తెలంగాణ ప్లేయర్కు గోల్డ్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మెరిసిన తెలంగాణ ప్లేయర్కు గోల్డ్

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో  తెలంగాణ క్రీడాకారుడు లోకేష్ రెడ్డి అదరగొట్టాడు.  బ్యాడ్మింటన్ సింగిల్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. పంజాబ్ ప్లేయర్ అభినవ్ తో జరిగిన ఫైనల్లో 21-19,15-21,22-20 స్కోరు తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. హోరా హోరీగా జరిగిన ఫైనల్లో తొలి సెట్ ను 21-19తో గెలుచుకున్న లోకేష్..రెండో సెట్ లో ఓడిపోయాడు. నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో తీవ్రంగా పోరాడాడు. కీలకమైన సమయంలో అద్బుతమైన షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించి మూడో సెట్ తో పాటు..మ్యాచ్ ను గెలుచుకున్నాడు. 

అటు అథ్లెటిక్స్‌లో 1500 మీటర్ల ఈవెంట్‌లో సుమిత్ కుమార్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. వీరితో పాటు..రాష్ట్ర బాక్సర్లు జి నిధి, ఎండి బిలాల్ తమ సెమీఫైనల్ బౌట్‌లలో ఓడిపోయిన కాంస్యాలతో సరిపెట్టుకున్నారు.