ఈసారి ఎన్నికల ఖర్చు 50 వేల కోట్లు

ఈసారి ఎన్నికల ఖర్చు 50 వేల కోట్లు

ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో  జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు రూ.50 వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. దీంతో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉండే  10కిపైగా లోక్ సభ నియోజకవర్గాలను ‘ఎక్స్ పెండిచర్ సెన్సిటివ్’ గా ఈసీ గుర్తించింది. మొత్తం 543 లోక్ సభ నియోజకవర్గాల్లో వీటి సంఖ్య 150 వరకు ఉంటుందనే అంచనా కూడా  ఉంది. తమిళనాడు లోని అన్ని లోక్ సభ స్థానాలు, ఏపీ, కర్నాటక, బీహార్, గుజరాత్ లోని సగం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలోని ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లను పంపాలని తొలిసా రి ఈసీ నిర్ణయించింది.

మల్టీ డిపార్ట్ మెంట్ ఎలక్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ (ఎండీఐసీ) డబ్బుల పంపిణీపై దృష్టి పెట్టనుంది. ఈ కమిటీ ఈ నెల 15న తొలిసారి భేటీ అయ్యింది.112 నియోజకవర్గా ల్లో ఓటర్లను ప్రలోభపెట్టేం దుకు నగదు, మద్యం , ఇంట్లో ఉపయోగించే పరికరాలను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు ఇచ్చిన ఇన్ పుట్ మేరకు ఈ అంచనాకు వచ్చిం ది. 39 నియోజక వర్గా లకు ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్లను పంపాలని తమిళనాడు సీఈవో కోరినట్లు తెలుస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టిన ఆరోపణలపై 2017లో తమిళనాడులోని ఆర్కే నగర్ ఉపఎన్నికను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని సున్నితమై నియోజకవర్గా లను ఇంకా ఫైనల్ చేయలేదు. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం , కేరళ, ఢిల్లీ, చండీగఢ్, అండమాన్ నికోబార్, డామన్ డయ్యూలో ప్రస్తుతానికి సున్నితమైన నియోజకవర్గా లను గుర్తించలేదన్న ఈసీ వీటిని మరోసారి పరిశీలిం చనుంది. మరోవైపు సున్నితమైన నియోజకవర్గా లు లేకున్నా ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్లను పంపాలని పశ్చిమ బెంగాల్ కోరింది.2014 సార్వత్రిక ఎన్నికల్లో 300 కోట్ల నగదుతోపాటు రూ.1,200 కోట్లను ఈసీ స్వాధీనం చేసుకుంది. ఏపీలో 124 కోట్లు, పంజాబ్ లో 700 కోట్లు విలువైన డ్రగ్స్ కూడా ఉన్నాయి. 2018లో  21 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రూ.1837 కోట్లు, గత నవంబర్, డిసెంబర్ లో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 296 కోట్లను ఈసీ స్వాధీనం చేసుకుంది.