34,604.. పోలింగ్ కేంద్రాలు : లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

34,604.. పోలింగ్ కేంద్రాలు : లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

వెలుగు: లోక్ సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. సోమవారం ఆయన ఎన్నికల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యా ప్తంగా మొత్తం 34,604 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశామన్నారు. 6,445 స్టేషన్లను క్రిటికల్​ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామన్నారు. నిజామాబాద్ పోటీలో నిలిచిన రైతుల సందేహాలను తీర్చామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వీవీప్యాట్ లను పంపామని, స్ట్రాం గ్ రూంలను పరిశీలిం చామన్నారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 2,97,08,599 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 2,96,95,548 మంది జనరల్​ ఓటర్లు ఉండగా 1,49,18,315 మంది మగవాళ్లు, 1,47,75,729 మంది ఆడవాళ్లు ఉన్నారన్నారు. మిగతా ఇతరులు 1054 మంది, 11,320 మంది సర్వీస్ ఓటర్లు, 1731 మంది ఓవర్సీస్‌‌‌‌ ఓటర్లు ఉన్నారని చెప్పారు.

96 శాతం ఎపిక్ కార్డు లు, 95 శాతం ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న 80 శాతం మందికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. 72 గంటల ప్రొటోకాల్​ ప్రారంభించామన్నా రు. 15 తర్వాత జెడ్పీ​ ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.

ప్రచారం బంద్

పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారాన్ని బంద్ పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రజత్ కుమార్ హెచ్చరించారు. సోషల్​ మీడియాలోనూ ఎలాంటి ప్రచారం చేయకూడదని, ప్రకటనలు ఇవ్వొద్దని అన్నారు. ఇబ్బడిముబ్బడిగా మెసేజ్ లు పంపొద్దన్నారు. మద్యం దుకాణాలనూ మూసేయాలన్నారు. నిజామాబాద్ లో సాయంత్రం 6 గంటల దాకా ప్రచారం చేసుకోవచ్చన్నారు. పెయిడ్ న్యూస్ పై 1939 కేసులు బుక్ చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 460, ప్రకటనలకు సంబంధించి 579 కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటిదాకా 52,61,57,093 కోట్ల విలువైన డబ్బు , బంగారం, మద్యాన్ని సీజ్ చేశామన్నారు. సీవిజిల్​ ద్వారా 1430 ఫిర్యాదులొచ్చాయని చెప్పారు. అభ్యర్థులపై కేసు నమోదైతే గెలిచాకైనా పదవి పోతుందని హెచ్చరించారు. కేరళలో జరిగిన ఘటనలను గుర్తు చేశారు.

ప్రగతిభవన్ లో చేరికలు ఈసీ దృష్టికి

ప్రగతిభవన్ లో టీఆర్ ఎస్ లో చేరికలపై పలు పార్టీల నుంచి ఫిర్యా దులు అందాయని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేశామని రజత్ కుమార్ చెప్పా రు. సోమవారం ఓ జాతీయ పార్టీకి చెందిన రూ.8 కోట్లు సీజ్ చేసిన ఘటన తమ దృష్టికి వచ్చిం దని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నా రు. హోంమంత్రి మహమూద్ అలీపైనా ఫిర్యాదులు వచ్చాయని, ఆ విషయాన్నీ ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పోలింగ్ రోజున సెలవు ఇవ్వాల్సిందేనని, ఇవ్వని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ బూత్ లోపల సెల్ఫీలు తీసుకుంటే అరెస్ట్​ చేస్తామని, బూత్ లకు దూరంగా సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేస్తామన్నారు. గుర్తింపు కార్డు కింద ఓటర్ స్లిప్ చెల్లదన్నా రు. అదొక్కటి తీసుకొస్తే సరిపోదని ఎపిక్ కార్డు లేదా ఐడెంటిటీ కార్డ్ తప్పనిసరని చెప్పారు. ఆధార్ , పాస్ పోర్ట్​, డ్రైవింగ్ లైసెన్స్ , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఐడీ కార్డు లు, బ్యాంకు, పోస్టా ఫీసు పాస్ బుక్కులు, పాన్ కార్డ్ , ఎన్ పీఆర్ కింద ఆర్ జీఐ జారీ చేసిన స్మార్ట్​ కార్డ్ , ఉపాధి హామీ పత్రం, ఆరోగ్య బీమా స్మార్ట్​ కార్డ్ , ఫొటో ఉన్న పింఛన్ కార్డు , ఎంపీ, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ లకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రాల్లోని ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.