కలిసివచ్చిన ఎన్నికలు.. గ్రేటర్ లో లిక్కర్ జోరు

కలిసివచ్చిన ఎన్నికలు.. గ్రేటర్ లో లిక్కర్ జోరు

హైదరాబాద్ : ఎన్నికల పుణ్యమా అని సిటీలో మద్యం ఏరులై పారింది. భారీగా ఆదాయం సమాకురింది. గతేడాది డిసెంబర్ 31న గ్రేటర్ పరిధిలో ఒకేరోజు రూ.120 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్ లోనూ భారీగానే లిక్కర్ అమ్మకాలు కొనసాగాయి. లోక్ సభ ఎన్నికల్లోనూ లిక్కర్ అమ్మకాల జోరు కొనసాగింది. ఇందులో చీప్ లిక్కర్ కంటే హైరేంజ్ బ్రాండ్ లే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి 9వ తేదీ వరకు జరిగి న అమ్మకాలను పోలిస్తే.. ఈ ఏడాది తొమ్మిది రోజుల్లోనే 75 శాతం మేర సేల్స్​పెరిగి నట్లు తెలుస్తోంది. గ్రేటర్‌‌ పరిధిలోని హైదరాబాద్‌ , రంగారెడ్డి, మేడ్చల్‌‌ జిల్లాలో నే ఎక్కవ శాతం లిక్కర్‌‌ అమ్మకాలు జరిగి నట్లు ఎక్సైజ్‌‌ అధికారులు చెబుతున్నారు.

మూడు జిల్లాల్లో కలిపి పెద్దమొత్తంలో ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. నగర పరిధిలో 183 మద్యం షాపులు, 246 బార్లు, 25 పబ్‌ లున్నాయి. లోకసభ ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి ముగిసే దాకా గ్రేటర్‌‌ పరిధిలోని లిక్కర్‌‌ షాపులు, బార్లలో సేల్స్​ రెట్టిం పు అయ్యాయి. సాధారాణ రోజుల్లో మద్యం అమ్మకాలు తక్కువ ఉన్నా గతేడాది డిసెంబర్ చి వర వారం నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి సుమారు రూ.500 కోట్లకుపైగా అమ్మకాలు జరిగి నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

కలిసివచ్చిన ఎన్నికలు..

అసెంబ్లీతోపాటు ఈమధ్య జరిగిన లోక్ సభ ఎన్నికలతో మద్యం షాపులు, బార్లకు కలిసివచ్చింది. కొందరు అభ్యర్థులు లిక్కర్ దుకాణాల యాజమానులతో ఒప్పందం కుదుర్చుకుని మద్యం తరలించినట్టు తెలుస్తోంది. కీలక నియోజకవర్గా ల్లో ఉన్న మద్యం షాపుల్లో విక్రయాలు భారీగా పెరిగాయి. ఒక్కో మద్యం షాపు యాజమాని నెలకు రూ.కోటి 40 లక్షల మద్యా న్ని సేల్ చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. ఇది మించి తే అదనంగా 20 శాతం పన్ను కట్టాల్సి ఉంటుం ది. ఈ క్రమంలో గతంలో కంటే ఈసారి 30శాతం అమ్మకాలు పెరిగితే ఆ దుకాణాలు వివరాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటా మని చెబుతున్నారు. మండే ఎండలతో పాటు లోక్ సభ ఎన్నికలు రావడంతో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. 30 శాతం మేర బీరు సేలింగ్ పెరిగి ఉంటుందని షాపుల యాజమానులు చెబుతున్నా రు. ఒక్కరోజు సుమారు రెండు వందల కాటన్ల బీరు అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిసింది.