
హైదరాబాద్: బీజేపీ ఎంపీ అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఫోన్ చేశారు. ఆర్మూర్ లో టీఆర్ఎస్ దాడి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ లో పోలీసులు ముఖ్యంగా నిజామాబాద్ సీపీ వ్యవహరించిన తీరును అర్వింద్ స్పీకర్ కు వివరించారు. పోలీసుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తనపై హత్యాయత్నం చేసిందని ఓంబిర్లాకు చెప్పారు. ఎంపీతో మాట్లాడిన స్పీకర్ వెంటనే ఆయనను ఢిల్లీకి రావాలని చెప్పారు. రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను కలిసి అర్వింద్ ఫిర్యాదు చేయనున్నారు.