లండన్: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'బాలన్ డి ఓర్' అవార్డుల ప్రదానోత్సవ వేదిక మారింది. ప్రతి ఏటా సాంప్రదాయకంగా పారిస్ నగరంలో జరిగే ఈ వేడుకను ఈ ఏడాది అక్టోబర్ 26న లండన్‌లో నిర్వహించనున్నారు.
ఇంగ్లండ్ ఫుట్‌బాల్ లెజెండ్ స్టాన్లీ మాథ్యూస్ తొలి బాలన్ డి ఓర్ అవార్డు గెలుచుకుని 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేదిక మార్పు చేసినట్లు సహ నిర్వాహకులైన ఫ్రాన్స్ ఫుట్‌బాల్ మ్యాగజైన్, యూఈఎఫ్ఏ గురువారం ప్రకటించాయి.
ఈ ఏడాది అవార్డు రేసులో ఇంగ్లండ్ టాప్ స్కోరర్ హ్యారీ కేన్ నిలిచాడు. జర్మన్ చాంపియన్ బైర్న్ మ్యూనిచ్ తరఫున ఆడిన అతను ఈ సీజన్‌లో 51 మ్యాచ్‌ల్లో 61 గోల్స్ చేశాడు. ఇందులో చాంపియన్స్ లీగ్‌లో చేసిన 14 గోల్స్ ఉన్నాయి.
