శ్రీలంకలో మిన్నంటిన ఆందోళనలు

శ్రీలంకలో మిన్నంటిన ఆందోళనలు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఆదేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స రేపు రాజీనామా చేయనున్న నేపథ్యంలో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో కొలంబోలోని ప్రెసిడెన్సియల్ ప్యాలెస్ కు వెళ్లే రహదారిపై వేలాది మంది నిరసనకారులు క్యూలో నిల్చొని నిరసన తెలియజేశారు. ఎండను లెక్కచేయకుడా గొడుగులు పట్టుకుని రోడ్డుపై కిలోమీటర్ల మేర ఆందోళన నిర్వహించారు. గోటబయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసమర్థ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రభుత్వం దిగిపోయే దాకా ఆందోళనలు కొనసాగుతాయని నిరసనకారులు తేల్చిచెప్పారు. గోటబయ చెప్పినట్లు ఈ నెల 13న రాజీనామా చేస్తే.. 20న కొత్త ప్రెసిడెంట్‌‌ను ఎన్నుకోనున్నట్లు మంత్రి ప్రసన్న చెప్పారు.