ప్రపంచంలోనే పొడవైన ముక్కు.. గిన్నిస్ బుక్‌లో చోటు

ప్రపంచంలోనే పొడవైన ముక్కు.. గిన్నిస్ బుక్‌లో చోటు

ఇంత పెద్ద విశాల ప్రపంచంలో ఎన్నో ఆసక్తికర, వింతైన  విషయాలు చాలా ఉంటాయి. ప్రపంచంలోనే ఎత్తైన, లోతైన, చిన్న .. వంటి వాటి గురించి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాయి. ఇప్పటివరకు ప్రపంచంలోనే పొడవైన పురుషుడు, పొడవైన స్త్రీ లాంటి వాటి గురించి విన్నాం కానీ..  ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తి గురించి ఎప్పుడైనా విన్నారా..? అంతే కాదు గత 300 ఏళ్లుగా ఆయన రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోవడం మరింత విస్తుగొలిపే అంశం. అయన పేరు గిన్నిస్ బుక్‌లోనూ రికార్డు కావడం మరో విశేషం. దీంతో ఈ వ్యక్తి ఎనలేనిప్రజాదరణ వచ్చింది. అంతే కాదు ఆయన మైనపు విగ్రహాన్ని లండన్‌లోని ఒక మ్యూజియంలోనూ పెట్టారు.

థామస్ వాడేహౌస్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కు కలిగి వ్యక్తిగా పేరు గడించాడు. అతని చిత్రాన్ని @pubity  అనే అకౌంట్ యూజర్ ఓ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. దీంతో పాటు ఆయనకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని కూడా షేర్ చేశారు. థామస్ వెడ్డర్స్ అని కూడా పిలువబడే థామస్ వాడ్‌హౌస్ 18వ శతాబ్దపు సర్కస్ షోలు చేసేవాడు. అతను 7.5 అంగుళాల పొడవైన ముక్కును కలిగి ఉన్నాడు. ఇతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ అయింది. ఇతను1770లలో ఇంగ్లండ్‌లో నివసించే వాడు. పొడవైన ముక్కు కలిగిన ఈ వ్యక్తి టర్కీకి చెందిన మెహ్మెట్ ఓజురెక్ పేరిట రికార్డు కూడా నమోదైంది. ఈ రికార్డును రెండు సంవత్సరాల క్రితం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది కూడా.  

మ్యూజియంలో మైనపు విగ్రహం

ప్రస్తుతం వైరల్ అవుతున్న థామస్ వాడ్‌హౌస్ ఫొటో లండన్‌లోని రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలోనిది. అతని మైనపు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలు కామెంట్లు చేస్తున్నారు. ఇంత పొడవాటి ముక్కును చూసి ఆశ్చర్యపోతున్నారు.

https://twitter.com/pubity/status/1647207990502780929