భారత్ పై నోరు పారేసుకున్న ట్రంప్..మురికి దేశమంటూ శృతిమించిన అధ్యక్షుడు

భారత్ పై నోరు పారేసుకున్న ట్రంప్..మురికి దేశమంటూ శృతిమించిన అధ్యక్షుడు

ఓటమికి ఆమడదూరంలో ఉంటే ఎవరైనా ఏం చేస్తారు. గెలవాలనే ప్రయత్నిస్తారు. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. మెప్పుకోసం ఏమైనా చేస్తారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇలా చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు భారత్ పై అమితమైన ప్రేమకురిపించిన ట్రంప్ ఓటమి ఖాయమైందని సర్వేలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో నోరు పారేసుకుంటున్నారు. భారత్‌ను మురికి దేశంగా అభివర్ణించిన ఆయన.. ఇండియాలో స్వచ్ఛమైన గాలి లేదని అన్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఇద్ద‌రు అభ్య‌ర్ధులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య మూడో డిబేట్‌లో పర్యావరణ మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్ భారత్, చైనా, రష్యా దేశాలు కాలుష్య కారకాలను విపరీతంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని.. దీంతో పర్యావరణం కలుషితం అవుతోందని విమ‌ర్శించారు.

చైనా, రష్యా, భారత్‌లను చూస్తే ఎంత మురికిగా ఉంటాయో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఆ మూడు దేశాల్లో గాలి కూడా మురికిగా ఉంటుందని ఆరోపించారు. కాగా.. భారత్‌పై ట్రంప్ చేసిన విమర్శలపై భారతీయులు భగ్గుమంటున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.