రూల్స్ బ్రేక్ చేస్తున్న సిబ్బందిపై నజర్

రూల్స్ బ్రేక్ చేస్తున్న సిబ్బందిపై నజర్

ఎస్​బీ రిపోర్ట్స్ తో యాక్షన్ ప్లాన్
అమలు చేస్తున్న పోలీస్ బాస్​లు
నారాయణగూడలో ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెన్షన్

హైదరాబాద్‌‌,వెలుగు: డిపార్ట్‌‌మెంట్‌‌లో  రూల్స్ బ్రేక్ చేస్తున్న సిబ్బందిపై పోలీస్ బాసులు ఫోకస్ పెట్టారు.  పీఎస్‌‌తో పాటు గ్రౌండ్ లెవల్‌‌ డ్యూటీ చేసే సిబ్బందిపై నిఘా పెట్టారు. సిటీజన్ల నుంచి వస్తున్న కంప్లయింట్స్ తో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. స్పెషల్‌‌ బ్రాంచ్(ఎస్​బీ) తో సీక్రెట్‌‌ ఎంక్వయిరీ చేయించి రిపోర్ట్స్‌‌ కలెక్ట్ చేస్తున్నారు. రూల్స్‌‌ బ్రేక్ చేసిన వారిపై ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌,సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. గత వారం నారాయణగూడలో ముగ్గురు కానిస్టేబుల్స్‌‌ను రూల్స్ బ్రేక్ చేసినందుకు సీపీ అంజనీకుమార్‌‌‌‌ సస్పెండ్ చేశారు.

ఆన్‌‌ డ్యూటీలో డ్రింక్ పార్టీ 

నెల 12న హైదర్‌‌‌‌గూడలోని ఓల్డ్‌‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌లో నారాయణగూడ పీఎస్‌‌కు చెందిన నాగరాజు,విశాల్‌‌,శివప్రసాద్‌‌ డ్రింక్ పార్టీ చేసుకున్నారు.ఈ ముగ్గురిపై అప్పటికే కంప్లయింట్స్ రావడంతో షాడో టీమ్ నిఘా పెట్టింది. ఆన్‌‌ డ్యూటీలో ఉండి మద్యం తాగుతున్న ముగ్గురిని సెల్‌‌ఫోన్‌‌లో షూట్‌‌ చేసింది. దీంతో కానిస్టేబుల్స్‌‌,షాడో టీమ్‌‌ వివాదం పీఎస్‌‌కి చేరింది. ఇదే విషయంపై స్పెషల్‌‌ బ్రాంచ్‌‌ ఎంక్వయిరీ జరిపి సీపీకి రిపోర్ట్ అందించింది. దీంతో ముగ్గురు కానిస్టేబుల్స్‌‌ను సస్పెండ్‌‌ చేస్తూ సీపీ అంజనీకుమార్‌‌‌‌ ఆర్డర్స్ జారీ చేశారు.

ట్రాఫిక్‌‌లో ప్రైవేట్‌‌ పర్సన్ డ్యూటీ

రాచకొండ కమిషనరేట్‌‌ లిమిట్స్‌‌లోని సాగర్‌‌‌‌ రింగ్‌‌ రోడ్‌‌లో ఓ ప్రైవేట్ వ్యక్తి ట్రాఫిక్ డ్యూటీ చేస్తున్నాడు. కానిస్టేబుల్స్‌‌,ఏఎస్సైతో కలిసి వెహికల్స్ కి సంబంధించి పెండింగ్ చలాన్స్ వసూలు చేస్తున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పికప్ చేసిన వెహికల్స్‌‌ కి చెందిన పెండింగ్ ఫైన్స్‌‌, ఈ– చలాన్స్ లిస్ట్ చెక్‌‌ చేసి వాటిని క్లియర్ చేయాలని ఆర్డర్స్ వేస్తున్నాడు. ప్రశ్నించిన వారికి తను కర్మన్‌‌ఘాట్‌‌ మీ సేవ సెంటర్‌‌‌‌కి చెందిన ఎంప్లాయ్​గా చెప్పుకుంటున్నాడు. పెండింగ్‌‌ చలాన్లను క్లియర్ చేసేందుకు తనను పోలీసులే నియమించారని చెప్తున్నాడు. పెండింగ్‌‌ చలాన్స్‌‌ ఆన్‌‌లైన్‌‌లో చెల్లించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోనే  క్లియరెన్స్‌‌ జరుగుతోంది. దీంతో ఆన్‌‌లైన్‌‌ చలాన్స్‌‌ క్లియరెన్స్‌‌లో గతంలో వాహనదారులకు పోలీసుల మధ్య వివాదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్‌‌ ట్రాఫిక్ పోలీస్‌‌ ఇష్యూ సీపీ మహేశ్‌‌ భగవత్‌‌ దృష్టికి వెళ్ళింది. దీంతో సంబంధిత ఏరియాలో స్పెషల్‌‌ బ్రాంచ్‌‌తో సీపీ ఎంక్వయిరీ చేయించారు. ఎస్‌‌బీ రిపోర్ట్ ఆధారంగా సంబంధిత ఇన్‌‌స్పెక్టర్‌‌ నుంచి వివరణ కోరినట్లు తెలిసింది. సిగ్నల్స్‌‌ వద్ద పోలీసులతో కలిసి పనిచేస్తున్న వ్యక్తి వివరాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ప్రైవేట్ పర్సన్స్‌‌తో పాటు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది డేటాను కలెక్ట్‌‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిపార్ట్‌‌మెంట్‌‌ లో ఇలా రూల్స్ బ్రేక్ చేసే పోలీసులను గుర్తించి యాక్షన్‌‌ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సమాచారం.