అలా రోజురోజుకీ మా మధ్య బంధం బలపడింది

అలా రోజురోజుకీ మా మధ్య బంధం బలపడింది

వరుస సినిమాలతో దూసుకుపోతూ, నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ రష్మిక మందన్నా బాలీవుడ్ లోనూ బిజీగా మారింది. గుడ్ బై సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూతురిగా నటిస్తున్న రష్మికకు ఈ మూవీ ప్రెస్టీజియస్ ఫిల్మ్. ఈ నేపథ్యంలో ఆమె చేసిన పలు కామెంట్లు వైరల్ గా మారాయి. ఆమెకు, బిగ్ బీకి మధ్య జరిగిన ఇంటరాక్షన్ కు సంబంధించి రష్మిక చెప్పిన ముచ్చట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

గుడ్ బై సినిమా షూటింగ్ తన పుట్టినరోజున ప్రారంభమైందని, ఆ రోజే అమితాబ్ బచ్చన్ ను తాను కలవడం మొదటిసారని రష్మిక చెప్పుకొచ్చింది. అతనితో మాట్లాడాలని అప్పటికే ఎంతగానే ఎదురుచూస్తున్న సమయంలోనే ఆయన అక్కడికి వచ్చారని.... అప్పుడు తాను ఓ మూలన ఎక్కడో నిల్చొని ఉన్నానని తెలిపింది. తాను మాత్రం ఆ నిల్చున్న ప్లేస్ లో అలా చూస్తూ ఉండిపోయానన్న రష్మిక.. అంతలోనే ఆయన రావడం.. తన ముందు నుంచే వెళ్లిపోవడం జరిగిపోయాయని అన్నారు. ఆ తర్వాత తానే వెళ్లి.. ఏదో ధీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా కనిపించిన బిగ్ బిని పరిచయం చేసుకున్నానని చెప్పారు. తన పేరు రష్మిక మందన అని.. ఈ సినిమాలో మీకు కూతురిగా నటించబోతున్నానని చెప్పానని తెలిపారు. అలా రోజురోజుకీ తమ మధ్య బంధం బలపడిందన్న రష్మిక... ఎప్పటిలాగే తాను షూట్ కి రాగానే అందరూ తనను మీరు ఈ రోజు ట్విట్టర్ చూశారా అని అడగడం చూసి చాలా ఆశ్చర్యపోయానన్నారు. తాను ట్విట్టర్ ఓపెన్ చేసి చూడగా... బచ్చన్ సర్ పుష్ప అనే పేరుతో ఓ పిక్ ను పోస్ట్ చేశారని రష్మిక తెలిపారు. ఈ సందర్భంలోనే భారతీయ సినిమాలోని ఇద్దరు దిగ్గజాలతో కలిసి పనిచేయాలనే నా కలలో జీవిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2లో నటిస్తుండగా, రణబీర్ కపూర్‌తో కలిసి యానిమల్‌లోనూ కనిపించనుంది.