Ganesh Chatrudhi 2025: వినాయకుని హారతి మంత్రాలు ఇవే..!

Ganesh Chatrudhi 2025: వినాయకుని హారతి మంత్రాలు ఇవే..!

వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం... విఘ్నాలు తొలగించే వినాయకుడిని శాస్త్ర ప్రకారంగా పూజించి.. నివేదన సమర్పించి.. చివరిలో మంగళహారతి ఇస్తారు.  వినాయకుడి  మంగళహారతి ఇచ్చేటప్పుడు చదవాల్సిన శ్లోకాలను తెలుసుకుందాం. . .

శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును అపర విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోక పూజ్యునకు...   జయమంగళం నిత్య శుభమంగళం...
 నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు 
వేరు వేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు .....జయ....
సురుచిరముగ భాధ్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్లు ...జయ...
 శశి చూడరాకున్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు ...జయ...
పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు 
తేనెతో మాగిన, తియ్యమామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ...జయ....
ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండుపంపు! 
కమ్మని నెయ్యియు కడుముద్దపప్పుయు బొజ్జ విరుగగ దినుచు పొరలు కొనుచు .....జయ....
 పళ్ళెరములో వేయి వేల ముత్యాలు కొండలుగ నీలములు కలియబోసి! 
మెండుగను హారములు మెడనిండ వేసికొని దండిగా నీకిత్తు ధవళహారతి ....జయ....
 పువ్వులను నినుగొలు పుష్పాల నినుగొలు గంధాల నిన్ను గొల్లు కస్తూరిని
ఎప్పుడూ నినుగొలు ఏక చిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు ....జయ.....
 ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగయిన తొండంబు వలపుకడుపు
జోకయిన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికి నిపుడు ...జయ...
 మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము దేవగణపతికి నిపుడు .. జయ....
 బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి, 
మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ... జయ....
 పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్లి గట్టిగా కనకములు కరులు హరులు
 యిష్టసంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు .... జయ....
 ముక్కంటి తనయుడని మదముతో వేమను చక్కనైన వస్తు సమితి గూర్చి
నిక్కముగ మనమును నీయందే నేనిల్చి ఎక్కడగు పూజలాలింపజేతు .... జయ....
 మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైన గంధ సారములను
 ఉల్లమలరగ మంచి ఉత్తమవు పూజలు కొల్లలుగనేజేతు కోరి విఘ్నేశ .... జయ...
 దేవాది దేవునకు దేవతాద్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును
 దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు ..... జయ....
 చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
 పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ...జయ....
  మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
 నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను ...జయ....
 ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలుమీ కరుణతోను
 మాపాలగలవని మహిమీద నెల్లప్పుడు కొని యాడుచుందము కోర్కెలీడేర .... జయ....