వినాయక చవితి పండగను చిన్నాపెద్ద ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. ఇందు కోసం ప్రతీ గల్లీలో మండపాలను ఏర్పాటు చేసి గణేశుడి విగ్రహాలను నెలకొల్పుతారు. నగర వాసులు కోసం బైపాస్ వద్ద రెండు నెలల క్రితం మహారాష్ట్ర, నాగపూర్, కోల్కతా నుంచి వచ్చిన కళాకారులు విభిన్న రూపాలలో గణనాథుల విగ్రహాలను సిద్ధం చేశారు.
ప్రత్యేకంగా మట్టితో చేసిన వినాయకుడు ఆకర్షణీయంగా తయారు చేశారు. అలాగే మహారాష్ట్ర, ముంబై, నాగపూర్ నుంచి వినాయక విగ్రహాలను తెచ్చి నిజామాబాద్ నగరంలో విక్రయిస్తున్నారు. విగ్రహాలను కొనుగోలు చేసేందుకు నగరవాసులు క్యూ కట్టారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్