ఆధ్యాత్మికం : ఆగస్టు 19న మంగళ గౌరీ వత్రం.. కొత్తగా పెళ్లయిన వాళ్లు చేస్తే చాలా శుభం

ఆధ్యాత్మికం : ఆగస్టు 19న మంగళ గౌరీ వత్రం.. కొత్తగా పెళ్లయిన వాళ్లు చేస్తే చాలా శుభం

పరమేశ్వరుడు...  శివుడు,...  సృష్టికర్త.. ఆయన సతీమణి పార్వతి దేవి అమ్మవారు. పార్వతి దేవి హిందువులకు  ముఖ్యమైన దేవత,...  శక్తి స్వరూపిణి. ఆమెను దుర్గ, గౌరి, ఉమ, భవానీ వంటి అనేక ఇతర పేర్లతో కూడా పూజిస్తారు.  అందుకే ఆ మాతను మహిళలు పూజిస్తారు. కొత్తగా పెళ్లయిన వారు ఈ వ్రతం చేస్తే అన్నీ శుభాలే జరిగి సౌభాగ్యం కలకాలం ఉంటుందని పండిటులు చెబుతున్నారు.

శ్రావణమాసం చివరి వారం కొనసాగుతుంది.  రేపు ( ఆగస్టు 19) ఈ ఏడాది ( 2025)లో పూజలు.. నోములు.. వ్రతాలు ఆచరించే  శ్రావణమాసం చివరి మంగళవారం  నిర్వహించే  మంగళగౌరీ వ్రతం   కొత్తగా పెళ్లైన వారే కాదు.. పెళ్లికాని అమ్మాయిలు కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు. హిందువుల వివాహాల సమయంలో పెళ్లికూతురితో గౌరిపూజ పేరుతో పార్వతిదేవిని పూజిస్తారు.  ఆ తరువాత వచ్చే మొదటి శ్రావణమాసంలో ప్రతి మంగళవారం మహిళలు మంగళగౌరి వ్రతం నిర్వహిస్తారు. 

శ్రావణమాసంలో మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతం ఆచరించడం స్త్రీలకు చాలా ముఖ్యమైనది.  పార్వతిదేవి అనుగ్రహం కోసం శ్రావణమాసం మంగళవారం మంగళగౌరి వ్రతంఆచరిస్తారు. ఈ వ్రతం స్త్రీలు సౌభాగ్యం, దీర్ఘాయువు, సుఖసంతోషాల కోసం చేస్తారు.ఈ ఏడాది శ్రావణమాసం చివరి మంగళవారం   ఆగస్టు 19. ఈ రోజున  స్త్రీలు పార్వతీదేవిని పూజించే వ్రతం.   ఈ రోజున ఉపవాసం ఉండి, పార్వతీదేవిని పూజించి, మంగళగౌరీ స్తోత్రాలు పఠిస్తారు. పార్వతి దేవి  ప్రేమ, సంతానోత్పత్తి, శక్తికి ప్రతీకగా అమ్మవారిని కొలుస్తారు. 

ఈ ఏడాది ( 2025) శ్రావణమాసం చివరి మంగళవారం ( ఆగస్టు 19)  పూజలు, ఉపవాసాలు చేస్తే శాశ్వతమైన అదృష్టం, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని విశ్వసిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని పండితులు చెబుతున్నారు.నాల్గవ, చివరి మంగళ గౌరీ వ్రతం ఆగస్ట్ 19   మంగళవారం నాడు ఆచరించాలి. 

వివాహమైనవారు.. సంతానం కోసం... సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే.. పెళ్లికాని కన్య పిల్లలు  మంచి భర్తను పొందేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.  అందుకే వివాహసమయంలో తమకు కాబోయే భర్త మంచిగా ఉండాలని..తన సౌభాగ్యం కలకాలం నిలవాలని గౌరీపూజను చేయిస్తారు.

మంగళ గౌరీ పూజా విధానం

  • ముందుగా శ్రావణమాసంలో మంగళవారం  ( ఆగస్టు 19) తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • తర్వాత శుభ్రమైన స్టూల్‌పై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గౌరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి
  • మంగళ గౌరీ దేవి ఎదుట బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించండి.
  •  మంగళ గౌరీ అమ్మవారికి  ధూపం, నైవేద్యం, పండ్లు, పువ్వులు మొదలైన వాటితో పూజించండి.
  • పూజ ముగిసిన తర్వాత గౌరీ దేవి హారతి ఇచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని ప్రార్థించండి.
  • ఈ రోజున వివాహిత స్త్రీలను ఇంటికి పిలిచి వాయినం ఇవ్వాలి. 

మంగళగౌరీ వ్రతం ప్రాముఖ్యత

శ్రావణంలో పడే మంగళ గౌరీ వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మంగళగౌరీని ఉపవాసం చేసి పూజించడం ద్వారా వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని, అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అదే సమయంలో పెళ్లికాని అమ్మాయిలు కూడా మంచి జీవిత భాగస్వామిని పొందడానికి ఈ వ్రతాన్ని పాటిస్తారు. సంతానం కలగాలంటే మంగళ గౌరీ వ్రతం శుభప్రదంగా భావిస్తారు.