కార్తీకమాసం.. మాసశివరాత్రి ( నవంబర్ 18).. శివయ్యకు అభిషేకం.. ఏ ద్రవ్యం.. ఎలాంటి ఫలితం..!

కార్తీకమాసం.. మాసశివరాత్రి ( నవంబర్ 18)..  శివయ్యకు అభిషేకం.. ఏ  ద్రవ్యం.. ఎలాంటి ఫలితం..!

పిలిస్తే పలికే దైవం శివుడు.  అలాంటి దేవుడికి కార్తీకమాసం అంటే చాలా ఇష్టం.. భోలాశంకరుడికి స్వామికి కార్తీక మాసం  నెల రోజులుఅభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేకత ఉన్నాయి.శివుడ్ని ఏ ద్రవ్యాలతో పూజిస్తే ఎలాంటా  ఫలితం వస్తుందో తెలుసుకుందాం.

ఆవు పాలతో….. సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు… ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి…. ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) …. దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం … పుత్ర లాభం
పుష్పోదకం… భూలాభం.. స్థిరాస్థి పెరుగుతుంది
బిల్వ జలం … భోగ భాగ్యాలు.. ఆనందం వెల్లివిరుస్తుంది
నువ్వుల నూనె… అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం … మహా ఐశ్వర్యం కలుగుతుంది.
సువర్ణ జలం … దరిద్ర నాశనం
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం.. అత్యున్నత పదవి లభిస్తుంది
గంగోదకం … సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
నవరత్న జలం… ధాన్య గృహ ప్రాప్తి
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం …. సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం … సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం …. శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)… ద్రవ్య ప్రాప్తి
ధవళోదకమ్ … శివ సాన్నిధ్యం
గంగోదకం … సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. నిరాశ తొలగుతుంది.
నవరత్న జలం… ధాన్య గృహ ప్రాప్తి
మామిడి పండు రసం… దీర్ఘ వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.
పసుపు, కుంకుమ… మంగళ ప్రదం
విభూది …. కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

పంచామృతాలను  భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి. స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది. ఆనందం పొందుతారు.ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్ర పధంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు. అభిషేకం వల్ల దీర్ఘకాలిక  రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అభిషేకం ఆరోగ్యం, ఐశ్వర్యం, శ్రేయస్సు, సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తుంది.

కార్తీకమాసం నెల రోజులు  శివయ్యను అర్చించి.. పూజలు చేసి అబిషేకంచేస్తే విశేష ఫలితాలను ఇస్తాడని పండితులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో జీవన విధానాన్ని అనుసరించి నెలరోజులు  కుదరదు.. అందుకే పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు కృష్ణపక్షం చతుర్దశి రోజున ( మాసశివరాత్రి.. నవంబర్​ 18)  అభిషేకం చేస్తే  దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతాయి. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. అదీ అభిషేక ప్రియుడు శివుడు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.