
ద్వాపరయుగంలో గోవులు కాచిన గోపాలుడే కలియుగంలో గోవిందుడిగా పూజలందుకుంటున్నాడు. . అందుకే ఆగస్టు 16 శనివారం.... గోకులాష్టమి వేడుకలుదేశ వ్యాప్తంగా వైభవంగా జరుగుతాయి. శ్రీకృష్ణుని జననమే ఓ అద్భుతమని పురాణాలు చెబుతున్నాయి.
కృష్ణాష్టమి ( ఆగస్టు 16) రోజు దేశంలో ఉన్న ఆలయాలన్నీ ...ముఖ్యంగా మధురబృందావనాలో ఉన్న నాలుగు వందల ఆలయాలు.. శ్రీ కృష్ణ గోవిందం భజేహం' నామస్మరణతో మోగిపోతాయి. ఆయే కన్నయ్య.. నందలాలా.. అని భజన సంకీర్తనలతో.. భక్తులు ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఉత్సాహంగా పాటలు పాడతారు. నల్లనయ్య కోసం ఇంటి ముందు ముగ్గులు వేసి తమ పిల్లల్ని చిన్ని కృష్ణుడిగా ముస్తాబు చేసుకొని మురిసిపోతారు.
కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దహి... దండీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరు పుకుంటారు. దీన్నే తెలుగు రాష్ట్రాల్లో ...ఉట్టి కొట్టడం... అంటారు. ఈ ఉట్టిలో వెన్న, పెరుగు ఉంటుంది.. కృష్ణుడు చిన్నతనంలో చేసిన చిలిపి పనుల్లో.. ఉట్టి మీద వెన్న దొంగిలించడం అందరికీ ఇష్ట మైన ఘట్టం. దీని ప్రేరణతోనే ప్రతి గల్లీలో ఉట్టి కొడతారు:
వరల్డ్ వైడ్ పూజలు...
కృష్ణాష్టమి రోజు (ఆగస్టు 16) ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడికి పూజలు, వేడుకలు జరుగుతాయి. పాకిస్తాన్. మలేసియా, బంగ్లాదేశ్ ల్లో కృష్ణుడి ఊరేగింపులు జరుగుతాయి. కరాచీలో శ్రీ స్వామి నారాయణ్ మందిరంలో వైభవంగా కృష్ణా ష్టమి వేడుకలు జరుగుతాయి. బంగ్లాదేశ్ లో డాకేశ్వరి ఆలయంలో కృష్ణుడి ఊరేగింపు ఉంటుంది. మలేసియాలోని కౌలంపూర్ లో ఉన్న కృష్ణాలయం...మురుగన్ ఆలయంతో పాటు కెనడాలోని టొరంటో, రీచేమనలో కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
న్యూజెర్సీ, కాలిఫోర్నియా, టెక్సాస్, సౌతాఫ్రి కా, రష్యాలో కూడా ఇస్కాన్ వాళ్లు వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుతారు. నేపాల్లోని కృష్ణుడి ఆలయంలో పూలు, సిడ్కా (నాణేలు) నైవేద్యంగా అందించడం అనవాయితీ. అలా చేస్తే ఆరోగ్యం, డబ్బు లభిస్తుందని వాళ్ల నమ్మకం. ఒడిశాలో జరుపుకున్నట్టుగానే.. పారిస్ లో అర్థరాత్రి వరకు ఉపవాసం ఉండి పొద్దున్నే చిన్ని కృష్ణుడి విగ్రహాలకు అభిషేకం చేస్తారు.