తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఉత్సవాల సందర్భంగా మేళతాళాలు, మందగళ వాయిద్యాలు మధ్య స్వర్ణరథంపై మాడ వీధుల్లో ఊరేగుతున్నారు మలయప్ప స్వామి. గోవింద నామ స్మరణలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు. అర్ధరాత్రి 12గంటల 5నిమిషాలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలతో పాటు, స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 1.45గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వైకుంఠ ద్వారం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ మంత్రులు, పలువురు ప్రముఖులు కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి: 

శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

లంచ్ టైమ్ లో చిరుకు జగన్ అపాయింట్