శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 13 నుంచి 22 వరకు  వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించింది TTD. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో పరిమిత సంఖ్యలోనే టీటీడీ అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ అళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 

ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీంతో ఈ రోజు కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. కోయిల్ అళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వర్ణరథం ఊరేగింపు కూడా జరుపుతామని తెలిపారు. 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగుల ద్వారా స్వర్ణరథం లాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు వాయిదా

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా

బెహన్ జీ లేకుండానే యూపీ ఎలక్షన్స్