ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. ప్రస్తుతం చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ వివో IPL స్పాన్సర్ గా ఉంది. 2022 స్పాన్సర్ షిప్ హక్కులు టాటాకు దక్కాయని IPL చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఈ సీజన్ లో స్పాన్సర్ షిప్ కోసం టాటా గ్రూప్ రూ.440 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. 2018 నుంచి 2022 వరకు IPL హక్కులను వివో కొనుక్కుంది. దీనికోసం రూ.2,200 కోట్లు చెల్లించేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. అయితే 2020లో గల్వాన్ లోయలో భారత్-, చైనా సైన్యాల మధ్య ఘర్షణల ప్రభావం మెగా టోర్నీపైనా పడింది. దీంతో ఆ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ ను వివో వదిలేసింది. అప్పుడు డ్రీమ్ ఎలెవెన్ సంస్థ మెగా టోర్నీకి స్పాన్సర్ చేసింది. 2021లో మళ్లీ వివో ఐపీఎల్ కు స్పాన్సర్ గా వ్యవహరించింది. 

ఇకపోతే, ఈ ఏడాది ఐపీఎల్ లో 10 జట్లు బరిలోకి దిగనున్నాయి. లక్నో, అహ్మదాబాద్ జట్లు లీగ్ లు అరంగేట్రం చేయనున్నాయి. వీటిలో లక్నో జట్టును రూ.7,090 కోట్లతో ఆర్పీఎస్ గోయెంకా గ్రూప్ దక్కించుకోగా.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ గ్రూప్ రూ.5,625 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరగబోయే టోర్నీకి సంబంధించి ప్లేయర్ల మెగా ఆక్షన్ ఫిబ్రవరిలో బెంగళూరులో జరగనుందని సమాచారం. గతేడాది నవంబర్ లో మిగతా 8 ఫ్రాంచైజీలు తమ జట్లలో కొనసాగే ప్లేయర్ల వివరాలను వెల్లడించాయి. 

మరిన్ని వార్తల కోసం: 

బెహన్ జీ లేకుండానే యూపీ ఎలక్షన్స్

హ‌రిద్వార్ లో పుణ్య‌స్నానాల‌పై క‌ఠిన ఆంక్ష‌లు

పవన్ కళ్యాణ్ కుమారుడికి, రేణుదేశాయ్ కు కరోనా