లారీ ప్రమాదంలో మృతి : ఆడుకుంటున్న చిన్నారి శవమై కనిపించాడు

లారీ ప్రమాదంలో మృతి : ఆడుకుంటున్న చిన్నారి శవమై కనిపించాడు

హైదరాబాద్: ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం జరిగింది. అప్పుడే అన్నం తిని బయట ఆడుకుంటుండగా..ఒక్కసారిగా చిన్నారి కేకలు వినిపించాయని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. లారీ దగ్గరకు వెల్లేసరికి తమ కొడుకు చనిపోయాడని కన్నీరుమున్నీరయ్యాడు తల్లిదండ్రులు. దీనిపై గోల్కొండ పోలీసులో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రూల్స్ కు విరుద్ధంగా ఎక్కువ లోడుతో పట్టపగలే లారీలకు పర్మీషన్ ఇవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.