డివైడర్ ను ఢీకొన్న లారీ.. వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిన టిప్పర్.. క్యాబిన్లో 2 గంటలు ఇరుక్కుపోయిన డ్రైవర్

డివైడర్ ను ఢీకొన్న లారీ.. వెనుక నుంచి వచ్చి ఢీకొట్టిన టిప్పర్.. క్యాబిన్లో 2 గంటలు ఇరుక్కుపోయిన డ్రైవర్

ఎల్బీనగర్, వెలుగు: కిరాణా సామగ్రితో మేడ్చల్ నుంచి ఆటో నగర్ కు వస్తున్న ఓ లారీ టైరు పగిలి డివైడర్ ను ఢీకొట్టగా..దాని వెనుకే వస్తున్న టిప్పర్ లారీ ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున హయత్ నగర్ లో జరిగింది. 

టిప్పర్​లారీ క్యాబిన్​లో నవీన్ అనే డ్రైవర్ ఇరుక్కుపోవడంతో 2గంటలపాటు శ్రమించి గ్యాస్ కట్టర్ తో క్యాబిన్ కట్ చేసి బయటకు తీశారు. వెంటనే దగ్గరలోని దవాఖానకు తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హయత్ నగర్ ఇన్​స్పెక్టర్​నాగరాజు గౌడ్ తెలిపారు.