
ముత్తారం, వెలుగు: ముత్తారం మండలం ఖమ్మంపల్లి–ముత్తారం ప్రధాన రహదారిపై ఇసుక లారీ డ్రైవర్లు బుధవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ ఖమ్మంపల్లి బ్లాక్ 2 క్వారీకి తాము వారం కింద వచ్చామని, అయినా ఇసుక లోడింగ్ చేయడం లేదని ఆరోపించారు.
ఎక్కువ డబ్బులిచ్చిన వారికే లోడింగ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక లారీలకు మాత్రం వెంటనే లోడ్ చేస్తున్నారని, ఇదేంటని అడిగితే నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. వారం నుంచి ఇక్కడే ఉండడంతో వంట సామగ్రి కూడా అయిపోయిందని, తాగునీటికి, తిండికి ఇబ్బందులు పడుతున్నామన్నారు.