బేగంపేటలో బీరు సీసాల లారీ బోల్తా

బేగంపేటలో బీరు సీసాల లారీ బోల్తా

హైదరాబాద్ : బీరు బాటిల్స్ తో వెళుతున్న లారీ అదుపు తప్పి నడిరోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన నగరంలోని బేగంపేట్ లో  జరిగింది. సోమవారం ఉదయం సంగారెడ్డి నుండి ఉప్పల్ వెళ్తున్న ఆ లారీ.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై బోల్తా పడింది.  సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. స్వల్పగాయాల పాలైన  డ్రైవర్ ను సమీప ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు నడిరోడ్డుపై లారీ పడిపోవడంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్కడున్న కొందరు బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. పోలీసులు వాటిని చోరీకి గురికాకుండా అడ్డుకున్నారు. వాహనాలను దారి మళ్లించారు. సుమారు 17 వందల పైగా బీర్ కాటన్స్  రోడ్ పై పడి ఉన్నట్టు తెలిసింది