ఫుడ్‌‌శ్వాప్‌‌తో బరువు తగ్గొచ్చు!

ఫుడ్‌‌శ్వాప్‌‌తో బరువు తగ్గొచ్చు!

అధిక బరువుతో ఉన్నవాళ్లు వెయిట్‌‌లాస్‌‌ అవ్వాలంటే ఫుడ్‌‌ హ్యాబిట్స్‌‌ మార్చుకోవాల్సిందే. చాలా మంది బరువు తగ్గేందుకు కొన్ని రకాల ఫుడ్స్‌‌ను పూర్తిగా మానేస్తుంటారు. ఎక్కువ క్యాలరీలు ఉండే ఫుడ్‌‌ తినకుండా ఉంటారు. అయితే ఇలా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్‌‌ ఐటమ్స్‌‌ను పూర్తిగా మానేయకుండా, వాటికి ఆల్టర్నేటివ్‌‌గా తక్కువ క్యాలరీలతో దొరికే ఐటమ్స్‌‌ వాడొచ్చు. అలాంటి ఆల్టర్నేటివ్‌‌  ఫుడ్స్‌‌ కొన్ని.

  • వెయిట్‌‌ లాస్‌‌ అయ్యే వాళ్లు ఎక్కువగా పాలు, పాల పదార్థాలు మానేస్తుంటారు. టీ, కాఫీలు కూడా తాగరు. పాలు చాలా హెల్దీ. కాబట్టి, పాలను పూర్తిగా మానక్కర్లేదు. ఫుల్‌‌ క్రీమ్‌‌ మిల్క్‌‌ వాడుతుంటే, వీటికి బదులుగా డబుల్‌‌ టోన్డ్‌‌ మిల్క్‌‌ వాడాలి. ఫుల్‌‌ క్రీమ్‌‌ మిల్క్‌‌తో పోలిస్తే, డబుల్‌‌ టోన్డ్‌‌ మిల్క్‌‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పాలతో రెగ్యులర్‌‌‌‌గా టీ, కాఫీలు తాగొచ్చు.
  •  చాలా మంది చక్కెరకు బదులుగా తేనె వాడుతుంటారు. నిజానికి తేనె హెల్దీయే కానీ, ఇందులో చక్కెరకంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి, వెయిట్‌‌లాస్‌‌ అవ్వాలనుకునేవాళ్లు చక్కెర, తేనె.. రెండింటినీ వాడకూడదు. వీటికి బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌‌ వాడొచ్చు.
  • వెయిట్‌‌లాస్‌‌ పీరియడ్‌‌లో ఉన్నవాళ్లు కొందరు పూర్తిగా నాన్‌‌వెజ్‌‌ మానేస్తే, మరికొందరు చికెన్‌‌ తింటుంటారు. చికెన్‌‌ తినాలనుకుంటే, అందులో లెగ్స్‌‌ తినకూడదు. దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, చికెన్‌‌ బ్రెస్ట్‌‌ తింటే మంచిది. చికెన్‌‌ బ్రెస్ట్‌‌లో కొవ్వు తక్కువగా, ప్రొటీన్స్‌‌ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇది హెల్దీ కూడా.
  • పండ్లు హెల్దీయే కదా అని చాలా మంది డైటింగ్‌‌లో ఉన్నప్పుడు జ్యూస్‌‌లు విపరీతంగా తాగుతుంటారు. పండ్లతో పోలిస్తే, జ్యూసెస్‌‌ అంత హెల్దీ కాదు. వీటిలో క్యాలరీలు ఎక్కువ, పోషకాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, డైరెక్ట్‌‌గా ఫ్రూట్స్‌‌ తినడం మేలు. ఇవి తింటే త్వరగా కడుపునిండిన ఫీలింగ్‌‌ కలుగుతుంది. పైగా న్యూట్రియెంట్స్‌‌ కూడా ఎక్కువగా అందుతాయి.