ఓడినా కూడా ఖర్చుల వివరాలు అందజేయాలి

ఓడినా కూడా ఖర్చుల వివరాలు అందజేయాలి

తెలంగాణలో ఇటివల గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అయితే కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారితో పాటు ఓడిపోయినప్పటికీ ప్రతి అభ్యర్థి  కూడా చేసిన ఖర్చులు వివరాలు నిర్ధేశిత ప్రొఫార్మాలో సంబంధిత మండల పరిషత్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఒక వేళ లెక్కలు సమర్పించకపోతే తీసుకునే కఠిన నిర్ణయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుది. ఓడిపోయిన వారు నిర్ణీత గడువులోగా ఖర్చుల వివరాలు సమర్పించకపోతే మూడేళ్లపాటు పోటీలో నిలిచే అర్హతను కోల్పోతారు. అలాగే గెలిచిన వారు ప్రస్తుత పదవిని కోల్పోవడంతో మూడేళ్ల పాటు పోటీలో ఉండకుండా అనర్హత వేటు పడుతుంది. ఎన్నికల ఫలితాలు  వెల్లడించిన రోజు నుంచి 45 రోజుల్లోపు ఖర్చుల వివరాలు అందజేయాలి. కానీ ఇప్పటి వరకు ఒక్కరు కూడా సమర్పించలేదని జిల్లా పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు.