పాఠ్యాంశంగా మద్యంతో అనర్థాలు: సీఎం జగన్

పాఠ్యాంశంగా మద్యంతో అనర్థాలు: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యంతో నష్టాలు అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి  అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్యం నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.  నాటుసారా తయారీ కాకుండా చూడాలన్నారు. మద్యంతో కలిగే నష్టాలను పాఠ్య ప్రణాళికలో ఉంచాలని సూచించారు. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగులకు మద్యం నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలన్నారు. మద్యం నిషేధం అమలు కోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుల వినియోగించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదన్నారు సీఎం జగన్.