ఆముదం వల్ల జుట్టుకి బోలెడు లాభాలు?

ఆముదం వల్ల జుట్టుకి బోలెడు లాభాలు?

ఇప్పుడంటే కొబ్బరి, ఆల్మండ్, ​ఆర్గాన్, లెమన్​ గ్రాస్​.. ఇలా బోలెడు హెయిర్​ ఆయిల్స్​ ఉన్నాయి . కానీ, ఇవేం లేని రోజుల్లో  జుట్టు చిట్లినా, ఊడినా ఆముదమే మెడిసిన్​. ఇప్పటీకీ చాలామంది అమ్మమ్మలు, నాన్నమ్మల హెయిర్​ ట్రీట్మెంట్​ ఇదే. అంతెందుకు పసిపిల్లల జుట్టుకి  ఆముదాన్నే పట్టిస్తారు. కానీ, కేవలం పసిపిల్లలకే కాదు పెద్దలకీ ఆముదాన్ని మించిన బెస్ట్​ హెయిర్​ ఆయిల్​ మరొకటి లేదు. వివిధ రకాల మెడిసిన్స్​లో వాడే ఆముదం వల్ల జుట్టుకి బోలెడు లాభాలున్నాయి. అవేంటంటే..

  • ఆఫ్రికాలోని ఇథియోపియా నుంచి ఆముదం అన్ని దేశాలకు పరిచయమైంది. రిసినస్​ కమ్యూనిస్​  మొక్క విత్తనాల నుంచి తీసే ఈ ఆయిల్​లో మెడిసినల్​ వాల్యూస్​ చాలా ఎక్కువ. కొబ్బరి, ఆర్గాన్​ ఆయిల్స్​లో మాదిరిగానే ఆముదంలోనూ ఫ్యాటీ యాసిడ్స్​ ఫుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకి మాయిశ్చరైజర్​లా పనిచేయడంతో పాటు దాని పెరుగుదలకి అవసరమయ్యే పోషకాలనిస్తాయి. 
  • ఆముదంలో ఒమెగా–6, ఒమెగా–9  ఫ్యాటీ యాసిడ్స్​ ఎక్కువ.  ఈ నూనె జుట్టులోని సహజ తేమని, ​ నేచురల్​ ఆయిల్స్​ని కాపాడుతుంది. తలస్నానం చేసినా జుట్టు వాటిని కోల్పోకుండా చూస్తుంది. అలాగే ఇందులోని  అమైనో యాసిడ్స్ జుట్టుకి​ నేచురల్​ అమోలియెంట్స్( నొప్పి నుంచి చర్మాన్ని కాపాడేది) ​గా  పనిచేస్తాయి. 
  • మాడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆముదం వాడాలి. తలలో చుండ్రు, దురద సమస్యలుంటే ఈ నూనెని మించిన మెడిసిన్​ లేదు. ఈ ఆయిల్​లోని యాంటీ బ్యాక్టీరియల్​, యాంటీ ఫంగల్​​ ప్రాపర్టీలు​ మాడు​ని ఇన్​ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. తల స్నానానికి అరగంట ముందు ఆముదం నూనెతో మాడుపై మసాజ్​ చేస్తే  ఇన్ఫెక్షన్లు దరిచేరవు. 
  • ఆముదంలోని విటమిన్​– ఇ జుట్టుని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్​  జుట్టుని ఫ్రీ ర్యాడికల్​ డ్యామేజ్​ నుంచి కాపాడతాయి. జుట్టు కుదుళ్లని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ నూనెలో ఉండే ఆల్ఫా– టోకోఫెరోల్​ మాడు​లో రక్త ప్రసరణ మెరుగు పరిచి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. 
  • మిగతా హెయిర్​ ఆయిల్స్​ కన్నా ఆముదం నూనె మందంగా ఉంటుంది. దానికి కారణం దీనిలో ఉండే ఫ్యాట్​. అది స్కాల్ఫ్​ని మాయిశ్చరైజ్​ చేసి జుట్టులోని  పీహెచ్​ని బ్యాలెన్స్​ చేస్తుంది. దీనివల్ల జుట్టు పొడి బారదు. ఈ నూనెని గోరు వెచ్చగా కాచి జుట్టుకు పట్టిస్తే  జుట్టు కుదుళ్లు ​​ ఆరోగ్యంగా ఉంటాయి. 
  • ఆముదంలోని  ఒకేయిక్​, లినోలెయిక్​ యాసిడ్స్​ స్ట్రెస్​, పొల్యూషన్​ , సరిగా కేర్​ తీసుకోకపోవడం వల్ల పాడైన జుట్టుని రిపేర్​​ చేస్తాయి.  
  • రాత్రి పడుకునే ముందు ఈ నూనెని జుట్టుకి రాస్తే జుట్టు చిట్లడం, జుట్టు రాలడం తగ్గు తుంది. జుట్టు మెరు స్తుంది కూడా.