
వరంగల్: ఒకరినోకరు ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.కానీ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించటం లేదని మనస్థాపానికి గురై బావిలోకి దూకి అత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ నగరంలో సంచలనం సృష్టించింది. ఖిల్లా వరంగల్ మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సాయి (23), అశ్వినీ (19) లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుంటామని వారు తమ తల్లిదండ్రులకు తెలియజేయగా తల్లిదండ్రులు వ్యతిరేకించినట్లుగా బంధువులు చెబుతున్నారు.
గురువారం ఇంటి నుండి బయటకు వెళ్లి వస్తానంటూ చెప్పిన సాయి…. ఆ తరువాత తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ప్రేమ పెళ్లికి అంగీకరించనందునే వీరిద్దరు కలిసి భావిలోకి దూకి అత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అత్మహత్య చేసుకున్న బావి వద్ద 2 సెల్ ఫోన్లు పల్సర్ బైక్, చెప్పులు లభ్యమయ్యాయి. మృతుడిది వరంగల్ నగర సమీపంలోని నక్కల పల్లి గ్రామం కాగా, మృతురాలుఅ శ్వనీ ది సిద్ధిపేట కు చెందినదిగా చెబుతున్నారు. మృతదేహాలను పోలీసులు, డిఆర్ఎఫ్ టీం…గజ ఇతగాళ్ల సాయంతో వెలికితీసారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.