
వైవిధ్యమైన కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నారు మెగా ప్రిన్స్ ‘వరుణ్ తేజ్’. అటు కామెడీ ఇటు యాక్షన్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మాస్, కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటూ తెలివిగా ముందుకెళుతున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. సినిమా షూటింగ్ ను ఇటీవలే లండన్ లో షూటింగ్ ప్రారంభించారు. నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.
లెటెస్ట్ గా తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను వరుణ్ తేజ్ పోస్టు చేశారు. అక్టోబర్ 29వ తేదీ నాగబాబు బర్త్ డే. 61వ ఏట అడుగు పెట్టారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. వరుణ్ తేజ్ విషయానికి వస్తే... ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. షూటింగ్ చాలా వరకు లండన్ లో జరుగనుంది. ఈ మూవీలో వరుణ్ బాడీగార్డ్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. మరోవైపు.. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమాని సైన్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక పైలెట్ పాత్రలో కనిపించబోతున్నారు.