మీకు లో బీపీ ఉందా ? అయితే మీ గుండె కాస్త జాగ్రత్త

మీకు లో బీపీ ఉందా ? అయితే మీ గుండె కాస్త జాగ్రత్త

మీకు లోబీపీ ఉందా ? అయితే మీరు డేంజర్‌లో పడినట్లే. ఇంత కాలం.. హైబీపీ.. ఉంటేనే హైరిస్క్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మనకు లో బీపీ ఉన్నా కూడా  హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువని చెబుతున్నారు వైద్య నిపుణులు.. ఇప్పుడు మీకు లోబీపీ ఉన్నా మీ గుండె ప్రమాదంలో ఉన్నట్లే అంటున్నారు. లోబీపీ ఉన్నవాళ్లకు కూడా హార్ట్ ఎటాక్‌తో చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా బీపీ 120/80 ఉంటుంది. ఈ మెజర్‌మెంట్స్ కన్నా ఎక్కువ ఉన్నా... తక్కువ ఉన్నా ప్రమాదమే. అందుకే మనం అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగానే ముందుగా బీపీనే చెక్ చేస్తారు. బీపీ  120/80 కన్నా తక్కువ ఉంటే లోబీపీ అంటారు. బీపీ తక్కువగా ఉంటే కళ్లు తిరగడం, అలసటగా అనిపించడం, చెమటలు పట్టడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు బీపీ పడిపోతే... హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదమని తాజాగా జరిగిన ఓ పరిశోధనలో తేలింది.  స్టడీ ఆధారంగా లోబీపీ ఉన్న స్ట్రోక్ పేషంట్స్,  హృదయ సంబంధిత వ్యాధులు లేని వాళ్లు, అంటే కేన్సర్, డెమింటియా లాంటి వ్యాధి గ్రస్తులు లోబీపీ కారణంగా గుండెపోటుతో మరణించే అవకాశాలు ఉన్నాయని తేల్చింది. 

బోస్టన్ యూనివర్శిటికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హ్యుగొ జె. అప్రిసియో వివరిస్తూ... ‘ లో బ్లడ్ ప్లజర్ అనేది స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చనిపోవడానికి ఎక్కువగా అవాకాశం ఉంది. ఈ రిస్క్ ఎక్కువగా పొగతాగే అలవాటు ఉన్న రోగుల్లో ఉంది. పొగరాయుళ్లతో పాటు డయోగ్నసిస్, గుండెజబ్బు ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులతో పాటు, క్యాన్సర్, డెమింటియా వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ ప్రమాదం ఎక్కవని’ ... తెలిపారు.  అయితే ప్రస్తుతం మనకు ఉన్న మార్గదర్శకాలు స్ట్రోక్ తర్వాత అధిక రక్తపోటుకు చికిత్స చేయాలని సిఫార్సు చేస్తున్నాయి. ఇప్పుడు రోగులకు బీపీ సాధారణంగా ఉన్నా ? లేక తక్కువ అయినా లేదా స్వల్పంగా పెరిగిన రక్తపోటులో చికిత్స చేయాలా వద్దా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దాదాపుగా మొదటి స్ట్రోక్ వచ్చిన 30000 మంది రోగులను పరిశోధకులు గుర్తించారు. స్ట్రోక్ రావడానికి ముందుగా 18 నెలల నుంచి వీరి రక్తపోటులో  తేడాలు ఉన్నట్లు గుర్తించారు. వీరందర్నీ కూడా నమోదైన బీపీ లెక్కల ప్రకారం విభజించారు. వీరిందరిని హృదయనాళ మరణాల ఫలితాల కోసం కాలక్రమేణా వాటిని అనుసరించారు.  అధిక రక్తపోటు , చాలా తక్కువ రక్తపోటు  అధికంగా మరణాలు జరగడానికి దోహదపడతాయిని గుర్తించారు.

దీంతో పాటు తక్కువ రక్తపోటు ఉన్న వ్యక్తులు అత్యధికంగా మరణించినట్లుగా పరిశోధనలో తేలింది. అయితే వారంతా  ధూమపానం, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ లేదా చిత్తవైకల్యం ఉన్నవారే. " స్వల్పం నుంచి అతి స్వల్ప రక్తపోటు -సాధారణ రక్తపోటు ఉన్న స్ట్రోక్ రోగులు, గుండు పోటు ఉన్న రోగులలో 10 శాతం మంది ఎక్కువగా చనిపోయే ప్రమాదం ఉందనిమా అధ్యయనం సూచిస్తుంది" అని ప్రొఫెసర్ అప్రిసియో చెప్పారు. అయితే ఎవరైనా స్ట్రోక్ కారణంగా చనిపోతే.. పేషంట్ కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులు, ఫ్యామిలీ డాక్టర్లను కూడా ప్రశ్నించి మరణానికి అసలు కారణాలు తెలుసుకోవాలన్నారు. ఈ అధ్యాయనం వల్ల అయినా చాలామంది ముందుగానే జాగ్రత్త పడి... గుండెపోటుకు గురికాకుండా ఉండాలని, లో బీపీ ఉన్నవాళ్లు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్లు, ధూమపానం చేసేవాళ్లు, క్యాన్సర్ వంటి రోగులు ముందు జాగ్రత్తలు తీసుకోని త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామన్నారు ప్రొఫెసర్ అప్రిసియో.