డయాబెటిక్ కంట్రోల్​లో లేనివాళ్లలో తక్కువగా సొరియాసిన్ ప్రొటీన్​

డయాబెటిక్ కంట్రోల్​లో లేనివాళ్లలో తక్కువగా సొరియాసిన్ ప్రొటీన్​

డయాబెటిస్ వచ్చిందంటే.. హెల్త్​ ప్రాబ్లమ్స్​ ఒక్కొక్కటిగా వస్తుంటాయి . డయాబెటిస్ కంట్రోల్​లో లేనివాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కారణం... ఇమ్యూనిటీ తక్కువ ఉండడంతో పాటు గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువ కావడమే. అంతేకాదు వీళ్లలోనే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు (మూత్ర నాళ సంబంధిత సమస్యలు) ఎక్కువ కనిపిస్తాయి. అందుకు కారణం తెలుసుకునేందుకు ఈ మధ్యే గ్లూకోజ్​ ఎఫెక్ట్ మీద  స్వీడన్​లోని కరోలిన్​స్కా ఇనిస్టిట్యూట్​కి చెందిన  రీసెర్చర్లు ఒక స్టడీ చేశారు. ఈ స్టడీ కోసం ప్రి–డయాబెటిక్​, డయాబెటిక్ కంట్రోల్​లో లేని వాళ్లు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ల యూరిన్, యూరినరీ బ్లాడర్ సెల్స్​తో పాటు బ్లడ్ సీరమ్ శాంపిల్స్​ని పరిశీలించారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లతో పోల్చితే  ప్రి–డయాబెటిక్, డయాబెటిక్ కంట్రోల్​లో లేనివాళ్లలో సొరియాసిన్ ప్రొటీన్​ తక్కువ ఉండడం గమనించారు. 

బ్యాక్టీరియా పెరగడానికి...
సొరియాసిన్ అనేది యూరినరీ ట్రాక్​ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. అంతేకాదు కొన్నిరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లని అడ్డుకుంటుంది కూడా. రక్తంలో చక్కెర శాతం ఎక్కువ ఉండడం వల్ల శరీరంలో ఉండే సొరియాసిన్  తగ్గుతుంది. రక్తంలో చక్కెర శాతం పెరిగితే అది మూత్రం (యూరిన్​)లో కలుస్తుంది. యూరిన్​లో చక్కెర ఉంటే బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. దాంతో మూత్రనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. డయాబెటిస్​ ఉన్న మహిళలకు మెనోపాజ్​ దశలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు రావడం గమనించారు. కారణం.. వీళ్లలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగినంత తయారుకాకపోవడమే. అందుకని వీళ్లు ఈస్ట్రోజన్ క్రీమ్ ఉపయోగిస్తే సొరియాసిన్ యాంటీబయాటిక్ లెవల్స్ పెరిగి,  సమస్య తగ్గుతుందని చెప్తున్నారు  రీసెర్చర్లు.