లోయర్ మానేరు డ్యామ్ కు త్రివర్ణ శోభ

లోయర్ మానేరు డ్యామ్ కు త్రివర్ణ శోభ

లోయర్ మానేరు డ్యాం త్రివర్ణ శోభ సంతరించుకుంది. మువ్వన్నెల కాంతులతో లోయర్ మానేరు డ్యాం వెలుగులీనుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని లోయర్ మానేరు డ్యామ్ను మూడు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. డ్యాం గేట్ల వద్ద కాషాయం, తెలుపు, ఆకుపచ్చ లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ జెండా రంగుల్లో నీరు దిగువకు పరవళ్లు తొక్కుతూ.. దేశ భక్తిని పెంపొందిస్తోంది. ఈ దృశ్యాలు వీక్షకులను అబ్బురపరుస్తున్నాయి.