గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి..అక్టోబర్ 1నుంచి అమల్లోకి..

గ్యాస్ సబ్సిడీకి ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి..అక్టోబర్ 1నుంచి అమల్లోకి..

న్యూఢిల్లీ: అర్హులైన కుటుంబాలకే రాయితీ గ్యాస్ అందేలా చూసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సబ్సిడీ ధరకే ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకోవాలంటే వినియోగదారులు తప్పనిసరిగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ రూల్​ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసుకున్న వినియోగదారులు ఎలాంటి చర్యలూ తీసుకోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 19 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 27.43 కోట్ల మంది వినియోగదారుల బయోమెట్రిక్ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.