దేశ ప్రజలకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ పై 29 రూపాయలు పెరిగింది.కేవలం మూడు నెలల్లో డొమెస్టిక గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండో సారి. పెంచిన ధరలు ఇవాళ్టి(జూన్7)నుంచే అమలులోకి రానున్నాయి. కమర్షియల్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు వరుస పెరుగుదలతో సామాన్యుపై మరింత భారం పడింది. పెరిగిన ధరలతో హైదరాబాద్ లో 14 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 965 రూపాయల నుంచి 994 లకు పెరిగింది.
ఇరాన్, అమెరికా యుద్దం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పెంపు చోటుచేసుకుంది. గత మార్చి 7న సిలిండర్‌పై రూ. 60 పెంచిన తర్వాత కేవలం మూడునెలల్లో ఈ పెంపు చోటుచేసుకుంది.
