ఎన్​విడియాతో ఎల్​టీటీఎస్​ జోడీ

ఎన్​విడియాతో ఎల్​టీటీఎస్​ జోడీ

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ సేవల సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్​టీటీఎస్​)  జెన్​ఏఐని ఉపయోగించి మెడికల్ ఇమేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచడానికి అమెరికన్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సంస్థ ఎన్​విడియాతో కలిసి పనిచేయబోతున్నట్టు తెలిపింది.

మెడికల్​ ఇమేజెస్​ నాణ్యతను పెంపొందించేందుకు మెడికల్​డివైజ్​ల కోసం సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సూచించిన ఆర్కిటెక్చర్లను అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం లక్ష్యం అని కంపెనీ   తెలిపింది.  పెద్దపేగులో కనిపించే అసాధారణ పెరుగుదలను మరింత కచ్చితత్వంతో గుర్తించడానికి అనువైన ఏఐ/ఎంఎల్​ మోడల్స్​ను తయారు చేస్తారని ఎల్​టీటీఎస్​ సీఈఓ అమిత్ చద్దా అన్నారు.