మొహాలీలో పరుగుల మోత మోగింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లను లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్ మెన్ చితకొట్టారు. సిక్సర్లు, ఫోర్లు బాదుతూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. వచ్చిన ప్రతీ బ్యాట్స్ మెన్ పంజాబ్ బౌలర్లపై విరుచుకు పడ్డారు.
మొదటి ఓవర్ నుంచి ఓపెనర్లు కేఎల్ రాహుల్ (12, 9 బంతుల్లో), కైల్ మేయర్స్ (54, 24 బంతుల్లో) రెచ్చిపోయి ఆడారు. పవర్ ప్లే ముగిసేసరికి లక్నో 74 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. మొదటి వికెట్ లో వచ్చిన ఆయుష్ బదోనీ (43, 24 బంతుల్లో) కూడా చెలరేగి ఆడాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ (72, 40 బంతుల్లో), నికోలస్ పూరన్ (45, 19 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో లక్నో 257 పరుగుల భారీ స్కోరు చేసింది.
పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (4 ఓవర్లు 29 పరుగులు) తప్ప ఏ బౌలర్ లక్నో బ్యాట్స్ మెన్ ను ఆపలేకపోయారు. పంజాబ్ మెయిన్ పేస్ బౌలర్లు హాఫ్ సెంచరీ దాటారు. పంజాబ్ బౌలర్లలో రబాడాకు రెండు వికెట్లు దక్కాయి. అర్షదీప్ సింగ్, పామ్ కరన్, లివింగ్ స్టోన్ చెరో వికెట్ పడగొట్టారు.