లక్కీ భాస్కర్.. దుల్కర్​ న్యూ మూవీ టైటిల్​

లక్కీ భాస్కర్.. దుల్కర్​ న్యూ మూవీ టైటిల్​

‘మహానటి’తో తెలుగులో మంచి గుర్తింపును అందుకుని, ‘సీతారామం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దుల్కర్ సల్మాన్.. మరో తెలుగు డైరెక్టర్‌‌‌‌తో కలిసి వర్క్ చేస్తున్నాడు. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శుక్రవారం దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి ‘లక్కీ భాస్కర్‌‌‌‌’ అనే టైటిల్​ని ఫిక్స్ చేస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు. దుల్కర్‌‌ ముఖాన్ని కరెన్సీ నోటుతో కప్పేసినట్టుగా దీన్ని డిజైన్‌‌ చేశారు. పోస్టర్‌‌ చూస్తుంటే డబ్బు నేపథ్యంలో సాగే కథ అని అర్థమవుతోంది. 

సితార ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు. ధనుష్‌‌తో వెంకీ తీసిన ‘సార్’ను కూడా వీళ్లే నిర్మించారు. ‘నమ్మలేని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథ’ ఇదని నిర్మాతలు తెలిపారు. డిఫరెంట్‌‌ స్టోరీ లైన్‌‌తో హై బడ్జెట్‌‌తో ఈ సినిమా ఉండబోతోందని అన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.